Homeసినిమావిశాఖలో AAA సినిమాస్.. కొత్త ఎయిర్‌పోర్ట్‌పై బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు!

విశాఖలో AAA సినిమాస్.. కొత్త ఎయిర్‌పోర్ట్‌పై బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు!

క్రైమ్ మిర్రర్, సినిమా:- పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ తాజాగా విశాఖపట్నంలో AAA సినిమాస్ మల్టీప్లెక్స్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా వైజాగ్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్న ఆయన, నగరంలో కొత్త ఎయిర్‌పోర్ట్ ప్రారంభం కావడంపై హర్షం వ్యక్తం చేశారు. విశాఖ అంతర్జాతీయ స్థాయి డెస్టినేషన్‌గా ఎదగాలని ఆకాంక్షించారు.వైజాగ్ తనకు ఎంతో ప్రత్యేకమైన నగరమని అల్లు అర్జున్ తెలిపారు. తన తొలి సినిమా గంగోత్రి రోజుల నుంచి విశాఖకు వస్తున్నానని, అప్పట్లో రోడ్లపై తనను ఎవరూ గుర్తించేవారు కాదని గుర్తుచేసుకున్నారు. ప్రస్తుతం అభిమానుల ప్రేమ కారణంగా అదే రోడ్లపై స్వేచ్ఛగా తిరగలేకపోతున్నానని సరదాగా చెప్పారు. తన కెరీర్ ప్రయాణంలో వైజాగ్ ప్రజల ఆదరణ ఎంతో ప్రత్యేకమని పేర్కొన్నారు.విశాఖలో తన పేరుతో AAA సినిమాస్ ఏర్పాటు కావడం కల నిజమైనట్టుగా ఉందని బన్నీ అన్నారు. ఇంత పెద్ద మాల్‌లో తన పేరు మీద ప్రతిష్టాత్మక థియేటర్ వస్తుందని ఎప్పుడూ ఊహించలేదని చెప్పారు. AAA సినిమాస్‌ను కేవలం సినిమా చూసే ప్రదేశంగా కాకుండా కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి మంచి జ్ఞాపకాలు సృష్టించుకునే ప్రదేశంగా తీర్చిదిద్దామని తెలిపారు.కొత్త ఎయిర్‌పోర్ట్ ప్రారంభం కావడంపై కూడా అల్లు అర్జున్ స్పందించారు. విశాఖ నగరం మరింత అభివృద్ధి చెంది అంతర్జాతీయ స్థాయి డెస్టినేషన్‌గా మారాలని ఆకాంక్షించారు.

ప్రభాస్‌పై టాలీవుడ్ నటుడి ఆసక్తికర వ్యాఖ్యలు.. ఆయన నా దేవుడు.. మా బంధం మాటల్లో చెప్పలేను!

భవిష్యత్తులో విశాఖ దుబాయ్ కంటే గొప్ప నగరంగా ఎదగాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.హైదరాబాద్ అమీర్‌పేట్‌లోని AAA సినిమాస్ విజయవంతమైన తర్వాత విశాఖలోనూ ఈ ప్రాజెక్ట్‌ను ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందని బన్నీ తెలిపారు. ఈ ప్రాజెక్ట్ కోసం సహకరించిన ఏషియన్ సునీల్, భరత్‌తో పాటు ఆర్కిటెక్ట్, మొత్తం టీమ్‌కు ఆయన అభినందనలు తెలిపారు. థియేటర్‌లో అత్యాధునిక సాంకేతికతను అందుబాటులోకి తీసుకొచ్చామని, వైజాగ్ ప్రేక్షకులకు ఇది తమ అంకితమని పేర్కొన్నారు.ఇక సినిమాల విషయానికి వస్తే.. అల్లు అర్జున్ ప్రస్తుతం దర్శకుడు అట్లీ తెరకెక్కిస్తున్న రాకా షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. ముంబైలో షూటింగ్ జరుగుతున్నప్పటికీ, వైజాగ్‌లో AAA సినిమాస్ ప్రారంభోత్సవం కోసం ప్రత్యేకంగా బ్రేక్ తీసుకుని వచ్చినట్లు ఆయన వెల్లడించారు.

తెలంగాణ కేబినెట్ విస్తరణకు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్…!

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు