సంపన్న కుటుంబాలకు కొమ్ముకాస్తున్న బీజేపీ సర్కార్
పేదల పై భారాలు… కార్పొరేటర్లకు లాభాలు
మంచిర్యాల, క్రైమ్ మిర్రర్ః దేశంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీక్రిష్ణ ఫైర్ అయ్యారు. బీజేపీ పాలనలో పేదలపై మితిమీరిన భారం పడడంతో పాటు కార్పొరేటర్లకు విపరీతమైన లాభాలు చేకూరుస్తున్నారని పారిశ్రామిక రంగాలను పూర్తిగా దెబ్బతీస్తున్నారని ఆయన మండిపడ్డారు. మంగళవారం పార్లమెంటులో ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడుతూ కేంద్రప్రభుత్వ విధానాలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఉ పాధిహామీ పథకం పేదల జీవనోపాదికి ఎంతో అవసరమని సంవత్సరానికి వంద రోజుల పని కల్పించడం ద్వారా వారి కుటుంబాలకు ఊరటగా ఉండేదని తెలిపారు.
కాని ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఇచ్చే వేతనాలు సరిపోవడం లేదని రోజుకు 200 పేదవాడి జీవితం ఎలా సాగుతుందని ప్రశ్నించారు. అదాని, అంబానీ లాంటి సంపన్నుల ప్రయోజనాలే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తూ అంబానివంటి కంపెనీలకు భారీ రాయితీలు ఇవ్వడం ఎంతవరకు సమంజనమని ప్రశ్నించారు. విదేశీ కంపెనీల డేటా సెంటర్ల పేరుతో లక్షల కోట్ల రూపాయ టాక్సీ నడలింపులు ఇస్తూ పేదల కోసం ఉన్న పదకాలను మాత్రం తగ్గించడం దారుణమని ధ్వజమెత్తారు.
పేద వాడికి సహాయం అందించాల్సిన సమయంలో డబ్బులేదని చెప్పే ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు లక్ష కోట్ల రాయల్టీ ఇవ్వడాన్ని ప్రజలు అర్థం చేసుకోవచ్చునన్నారు. పేద, రైతు, కార్మిక కర్షక సంక్షేమానికి కాపాడే విధంగా ప్రభుత్వ విధానాలు ఉండాలని ఉపాధిహామీ పథకాన్నిబలోపేతం చేసి వారికి తగిన వేతనాలను చెల్లించాలని తెలిపారు. ప్రజల పక్షాన తమ నేత రాహుల్ గాంధీ తో కలిసి ప్రభుత్వాన్నినిలదీస్తామన్నారు.
సింగరేణి రిటైర్డ్ ఉద్యోగులకు రూ. 10వేలు పెన్షన్ ఇవ్వాలి…
తెలంగాణలోని ఆరు జిల్లాల్లో విస్తరించి సింగరేణి సంస్థలో మూడు నుంచి నాలుగు దశాబ్దాలపాటు పని చేసి ఉద్యోగ విరమణ పొందినటువంటి రిటైర్డ్ ఉద్యోగులకు కనీస పెన్షన్ రూ.10వేలు ఉండాలని పెద్దపల్లి పార్లమెంటు సభ్యులు గడ్డం వంశీ క్రిష్ణ డిమాండ్ చేశారు. ఆయన పార్లమెంటులో మాట్లాడుతూ 1990 నుంచి 1996 మధ్యకాలంలో ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగులకు రూ.200 నుంచి వెయ్యివరకు పెన్షన్ దొరుకుతుందని ప్రభుత్వాలు ఇచ్చే పెన్షన్ కంటే ఇది చాలా తక్కువని తెలిపారు.
వెయ్యి రూపాయల పెన్షన్లు వారి జీవనోపాది ఎలా సాగుతుందని, పెరిగిన ధరలకు ఇచ్చే పెన్షన్ ఎలా సరిపోతుందని ప్రశ్నించారు. వారికి కనీస పెన్షన్ రూ.10వేలు అందించేలా చూడాలని త్వరలోనే రిటైర్డ్ ఉద్యోగులతో కలిసి ఢిల్లీలో ఆపసరమైతే ఆందోళనకు కూడ వెనుకాడబోమని హెచ్చరించారు.
