Tuesday, March 24, 2026
Homeఆంధ్ర ప్రదేశ్వైఎస్ ఫ్యామిలీ కి పొలిటికల్ డామేజ్....!

వైఎస్ ఫ్యామిలీ కి పొలిటికల్ డామేజ్….!

  • విజయమ్మ లేఖతో కలకలం

  • జగన్మోహన్ రెడ్డితో రాజశేఖర్ రెడ్డి సన్నిహితుల భేటీ

  • వివాదానికి పరిష్కారం చూపే ప్రయత్నం

క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో: వైయస్ కుటుంబంలో ఆస్తి చిచ్చు రోజు రోజుకు ముదురుతున్న సంగతి తెలిసిందే. తాజాగా వైయస్ విజయమ్మ తన కుమారుడు జగన్మోహన్ రెడ్డి తప్పు అంటూ న్యాయస్థానానికి లేఖ రాశారు. తన కుమార్తె షర్మిల పిల్లలకు అన్యాయం చేస్తున్నారు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

దేవుడు పై ప్రమాణం వేసి నిజం చెబుతున్నాను అంటూ చెప్పుకొచ్చారు. దీంతో జగన్మోహన్ రెడ్డి చెబుతున్నది అబద్ధం అని ఎక్కువ మంది నిర్ధారణకు వస్తున్నారు. మరోవైపు వైయస్ విజయమ్మ రాసిన లేఖ ఫేక్ అని.. అది షర్మిల సృష్టించినదని.. దీని వెనుక ఏపీ సీఎం చంద్రబాబు ఉన్నారంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.

అయితే అది వైయస్ కుటుంబ వ్యవహారం అయితే.. మధ్యలో చంద్రబాబుకు ఏం పని అన్నట్టు ఎక్కువమంది కొట్టి పారేస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డికి ఇది పొలిటికల్ గా డ్యామేజ్ చేస్తోంది. ఆపై రాజశేఖర్ రెడ్డి కుటుంబ పరువు వీధిన పడుతోంది.. అందుకే ఇప్పుడు ఈ వివాదం పరిష్కరించేందుకు కొంతమంది రంగంలోకి దిగినట్లు ప్రచారం నడుస్తోంది.

రంగంలోకి కెవిపి..
రాజశేఖర్ రెడ్డి కుటుంబ సన్నిహితులు అంటే ముందుగా గుర్తొచ్చేది కెవిపి రామచంద్ర రావు. రాజశేఖర్ రెడ్డి మెడిసిన్ చదివిన నాటి నుంచి కెవిపితో స్నేహం ప్రారంభం అయింది. రాజశేఖర్ రెడ్డి మరణం వరకు అది కొనసాగింది.

కెవిపిని రాజశేఖర్ రెడ్డి ఆత్మతో అప్పట్లో పోల్చేవారు. అయితే రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత కెవిపి రామచంద్రరావు కాంగ్రెస్ పార్టీలోనే ఉండిపోయారు. ఆయన వైసీపీలోకి వెళ్లే ప్రయత్నం చేయలేదు. జగన్మోహన్ రెడ్డి సైతం పిలవలేదు.

కానీ ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి కుటుంబ సభ్యులు ఆస్తి వివాదాల్లో చిక్కుకోవడం.. ఇందులో విజయమ్మ బయటకు రావడంతో ఆ కుటుంబ ప్రతిష్టకు డ్యామేజ్ జరిగింది. అందుకే కెవిపి కలుగజేసుకున్నట్లు తెలుస్తోంది. జగన్మోహన్ రెడ్డితో ప్రత్యేకంగా భేటీ కూడా అయినట్లు పొలిటికల్ వర్గాల్లో ప్రచారం సాగుతోంది.

ఉండవల్లి అరుణ్ కుమార్ సైతం..
ఇంకోవైపు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సైతం ఈ విషయంలో ప్రత్యేకంగా కలుగజేసుకున్నట్లు సమాచారం. తెలంగాణలో షర్మిల పార్టీ ఏర్పాటు చేసినప్పుడు ఉండవల్లి అరుణ్ కుమార్ హాజరయ్యారు. తన స్నేహితుడి కుమార్తెగా ఆశీర్వదించారు.

రాజశేఖర్ రెడ్డి ప్రోత్సాహంతోనే తాను రెండుసార్లు రాజమండ్రి ఎంపీ అయినట్లు అదే వేదికపై గుర్తు చేశారు. ఉండవల్లి అరుణ్ కుమార్ మాటల్లో రాజశేఖర్ రెడ్డి పై ఉన్న ఫేవర్ కనిపిస్తుంది. ఆయన జగన్మోహన్ రెడ్డికి శ్రేయోభిలాషి గానే చెప్పుకుంటారు.

రాజశేఖర్ రెడ్డి పై ఉన్న అభిమానంతో ఇప్పుడు ఆ కుటుంబంలో జరుగుతున్న పరిణామాలతో ఉండవల్లి అరుణ్ కుమార్ సైతం బాధపడినట్లు తెలుస్తోంది. ఆయన సైతం రంగంలోకి దిగినట్లు సమాచారం. ప్రస్తుతం కెవిపి తో పాటు ఉండవెల్లి జగన్మోహన్ రెడ్డితో చర్చలు జరుపుతున్నట్లు పొలిటికల్ వర్గాల్లో టాక్ నడుస్తోంది.

రోజురోజుకు జగడం..
ప్రస్తుతం వైయస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబ వ్యవహారం ముదిరిపాకనపడుతోంది. ఒకవైపు వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు.. ఇంకోవైపు రాజశేఖర్ రెడ్డి కుటుంబంలో ఆస్తివ్యవహారాలతో.. ఆ కుటుంబానికి పొలిటికల్ గా డ్యామేజ్ జరుగుతోంది.

దిద్దుబాటు చర్యలు చేపట్టకపోతే అందరికీ నష్టం అన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు సన్నిహితులు. వీలైనంతవరకు ఆ వివాదానికి పరిష్కార మార్గం చూపించాలి అనుకుంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో?

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments