* 3 రోజుల పాటు కొనసాగనున్న బ్రహ్మోత్సవాలు
* మార్చి 25 నుంచి నుంచి పూజా క్రతువులు
* 27న సీతారామ చంద్రస్వామి కళ్యాణం
* ఏర్పాట్లు పూర్తి చేసిన భక్త మండలి
క్రైమ్ మిర్రర్, నల్లగొండ: నల్లగొండ జిల్లా కనగల్లు మండలం చిన్నమాధారం గ్రామ పరిధిలోని కుమ్మరిగూడెంలో శ్రీ భక్తాంజనేయ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరగబోతున్నాయి. మూడు రోజుల పాటు ఈ ఉత్సవాలు కొనసాగనున్నాయి. మార్చి 25న సుప్రభాతంతో ప్రారంభం కానున్న ఈ వేడుకలు, మార్చి 27న అన్నప్రసాద వితరణతో ముగియనున్నాయి.
మూడు రోజుల పాటు వార్షిక బ్రహ్మోత్సవాలు
శ్రీ భక్తాంజనేయ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు మార్చి 25న ప్రారంభం కానున్నాయి. ఉదయం 7 గంటలకు సుప్రభాతం, మామిడాకు తోరణం, గోపూజ, 9 గంటలకు గణపతి పూజ, పుణ్యాహవాచనం, ప్రాయశ్చిత్తం, ఆచార్యాది ఋత్వగ్వ రుణం, రక్షాబంధనం, అఖండ దీపారాధన, సర్వతోభద్ర మండపారాధన జరగనున్నాయి. 11 గంటలకు ఆంజనేయ స్వామికి 108 అష్టోత్తర కలశాభిషేకం, సాయంత్రం 4 గంటలకు అగ్నిప్రతిష్ఠాపన, గణపతి హోమం, మండప హోమాలు, సాయంత్రం 7 గంటలకు మంగళహారతి, మంత్రపుష్పం, తీర్థప్రసాద వితరణ చేయనున్నారు.
రెండవ రోజు అయిన మార్చి 26న ఉదయం 8 గంటలకు నిత్యపూజలు, పంచామృతాభిషేకం, స్వామివారికి సింధూర లేపనము చేయనున్నారు. 11 గంటలకు సామూహిక హోమాలు, సాయంత్రం 5 గంటలకు స్వామివారికి విశేష అర్చన, రాత్రి 7 గంటలకు మంగళహారతి, మంత్ర పుష్పం, తీర్థప్రసాద వితరణ చేయనున్నారు.
మూడవ రోజు మార్చి 27న ఉదయం 7 గంటలకు సుప్రభాతం, 10 గంటలకు శ్రీ సీతారామ చంద్రస్వామి దివ్య కళ్యాణ మహోత్సము జరగనుంది. మధ్యాహ్నం ఒంటి గంటకు అన్నప్రసాద వితరణ జరగనుంది.
ఏర్పాట్లు పూర్తి చేసిన భక్త మండలి
ఇక స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయని ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ సర్పంచ్ మల్లికంటి సుజాత-రాజు వెల్లడించారు. మూడు రోజుల పాటు రామడుగు చంద్రశేఖర శర్మ, ఆలయ పురోహితులు బ్రహ్మశ్రీ కొండ గడప హరిప్రసాద్ సమక్షంలో ఈ ఉత్సవాలు కొనసాగనున్నట్లు తెలిపారు. ఈ వేడుకల్లో పెద్ద సంఖ్యలో భక్తులు, గ్రామస్తులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఉత్సవ ఏర్పాట్లను భక్త మండలి సభ్యులు చిట్టిమల్ల కోటయ్య, చిట్టిమల్ల దశరథ,చిట్టిమల్ల వెంకన్న, మల్లికంటి దుర్గయ్య, చిట్టిమల్ల బసవయ్యతో పాటు ఇతరులు దగ్గర ఉండి చూసుకుంటున్నారు.
