* అన్న అనే పదానికి కలంకం అంటున్న షర్మిల
* తన కుమార్తె పిల్లలను అన్యాయం చేస్తున్నాడు అంటున్న విజయమ్మ
* తన తండ్రి హత్య నిందితులను కాపాడుతున్నాడు అంటూ వైయస్ సునీత
క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్ బ్యూరో: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి పై సొంత కుటుంబ సభ్యులే తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఆయనను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు. తన కుమార్తె షర్మిల పిల్లలను కుమారుడు జగన్మోహన్ రెడ్డి అన్యాయం చేస్తున్నారంటూ విజయమ్మ ఆరోపిస్తున్నారు. అన్న అనే పదానికి జగన్ మోహన్ రెడ్డి కళంకం అని షర్మిల తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఇటీవల జగన్మోహన్ రెడ్డి తల్లితోపాటు చెల్లెలికి దగ్గరవుతున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ అది ఎంత మాత్రం నిజం కాదని తాజాగా తేలిపోయింది. విజయమ్మతో పాటు షర్మిల ఇద్దరూ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసుకున్నారు. మరోవైపు వివేకానంద రెడ్డి కుమార్తె సునీత నుంచి నేరుగా జగన్మోహన్ రెడ్డి పైనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ ముప్పేట దాడితో జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా డ్యామేజ్ అవుతున్నారని వైసీపీలో ఒక ప్రచారం తో పాటు భయం ఉంది.
భారీగా డ్యామేజ్ చేసిన షర్మిల..
జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా దెబ్బతీయడంలో ఆయన సోదరి షర్మిల సక్సెస్ అయ్యారు. గత ఎన్నికలకు ముందు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు తీసుకున్నారు షర్మిల. ఆమె కాంగ్రెస్ పార్టీ బలోపేతం కంటే జగన్మోహన్ రెడ్డి పతనం కోసం ఎక్కువగా పరితపించారు అన్నది బహిరంగ రహస్యం. వివేకానంద రెడ్డి హత్య నుంచి వైసిపి ప్రభుత్వ వైఫల్యాల వరకు ఏకిపారేశారు. అదే సమయంలో వైయస్ విజయమ్మ సైతం షర్మిలను గెలిపించండి అని కడప జిల్లా ప్రజలను కోరారే తప్ప.. మరోసారి తన కుమారుడికి ఛాన్స్ ఇవ్వాలని ఆమె కోరలేదు. తద్వారా తన ఆశీర్వాదం కుమార్తె షర్మిలకు తప్ప కుమారుడు జగన్మోహన్ రెడ్డికి లేదని ఆమె సంకేతాలు పంపారు. పరోక్షంగా మంచి పరిపాలన జగన్ అందించలేకపోయారని ప్రజల్లో అభిప్రాయం వచ్చేలా వ్యవహరించారు. అందుకే ఆ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి భారీ పొలిటికల్ డామేజ్ జరిగింది. దారుణాతి దారుణంగా ఓడిపోయారు ఆంధ్ర ప్రదేశ్లో.
కలిసిపోతారంటూ వార్తలు..
అయితే వైయస్ కుటుంబ చరిత్ర మసకబారడంతో.. ఆ కుటుంబ సన్నిహితులు రంగంలోకి దిగి తల్లితో పాటు ఇద్దరు పిల్లలను కలుపుతారని వార్తలు వచ్చాయి. కానీ అదంతా ఉత్త ప్రచారం అని తేలిపోయింది. ఏకంగా విజయమ్మ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. వైయస్ కుటుంబ ఆస్తి మొత్తం తన నలుగురు మనవలు, మనవరాలుకు సమానంగా పంచాలని రాజశేఖర్ రెడ్డి నిర్ణయించారని చెప్పుకొచ్చారు. షర్మిల తన పిల్లలకు రాజ్యాంగబద్ధంగా రావాల్సిన ఆస్తుల కోసమే అడుగుతున్నారు తప్ప మరొకటి కాదు అన్నారు. తన కుమారుడు షర్మిల పిల్లలకు అన్యాయం చేస్తున్నాడు అంటూ జగన్ పైనే న్యాయస్థానాన్ని ఆశ్రయించారు విజయమ్మ. ఇంకో వైపు జగన్మోహన్ రెడ్డి అన్న అనే పదానికి కలంకం అన్న పెద్ద మాట వాడేశారు షర్మిల. తద్వారా ఆ కుటుంబంలో పరిస్థితి చేయి దాటిపోయింది. మళ్లీ వారి మధ్య సయోధ్య పరిస్థితి కనిపించడం లేదు.
ముగ్గురు మూడు వైపులా..
ఒకవైపు షర్మిల, ఇంకోవైపు విజయమ్మ దాడి కొనసాగుతుండగా.. మరోవైపు వివేకానంద రెడ్డి కుమార్తె షర్మిల విరుచుకుపడుతున్నారు సోదరుడు జగన్మోహన్ రెడ్డి పై. ఇటీవల జరుగుతున్న పరిణామాలతో ఆమె మీడియా ముందుకు వచ్చి తన తండ్రి హత్య వెనుక సూత్రధారులను బయట పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. నిందితులను జగన్మోహన్ రెడ్డి కాపాడారని బాహాటంగానే చెబుతున్నారు. అయితే ఇటీవల రాజశేఖర్ రెడ్డి కుటుంబంలో పరిస్థితులు కుదురుకున్నాయని అంతా భావించారు. కానీ అప్పటికంటే మరింత వివాదాలు పెరిగాయని సంకేతాలు అందుతున్నాయి. 2029 ఎన్నికల్లో కూడా ఆ కుటుంబం ఏకతాటి పైకి రావడం కష్టమేనని తేలిపోతోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో??
