Homeఆంధ్ర ప్రదేశ్తెలుగు రాష్ట్రాల‌కు భారీ వ‌ర్షాలు....ఆరు జిల్లాల‌కు ఎల్లో అల‌ర్ట్‌...!

తెలుగు రాష్ట్రాల‌కు భారీ వ‌ర్షాలు….ఆరు జిల్లాల‌కు ఎల్లో అల‌ర్ట్‌…!

హైద‌రాబాద్‌, క్రైమ్ మిర్ర‌ర్: ఈ సంవ‌త్స‌రం ఎండ‌ల తీవ్ర‌త పెరిగింది. దీంతో ప్ర‌జ‌లు ఉక్క‌పోత‌తో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఎండ‌ల తీవ్ర‌త దృష్ట్య ఒంటి పూట బ‌డుల‌కు విద్యాశాఖ అనుమ‌తినిచ్చింది. కాగా ఎండ తీవ్ర పరిస్థితి తెలుగు రాష్ట్రాల్లో ఒకే విధంగా ఉంది. ఈ స‌మ‌యంలో వాతావ‌ర‌ణ శాఖ చ‌ల్ల‌ని క‌బురు తెలిపింది. తెలంగాణ‌లో వ‌చ్చ ఆరు రోజులు ఉరుములు, మెరుపుల‌తో కూడిన వ‌ర్షాలు కురుస్తాయ‌ని తెలిపింది. మార్చి 16 నుంచి 21 వ‌ర్షాలు కురుస్తాయ‌ని తెలిపింది.

సోమ‌వారం ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, కరీంనగర్, హైదరాబాద్, నల్గొండ జిల్లాల్లో మొదలై మంగళ, బుధవారాల్లో ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మరికొన్ని ప్రాంతాలకు ఈ భారీ వర్షాలు విస్తరిస్తాయని తెలిపింది. ఈ నేపథ్యంలో ఎల్లో అలర్ట్‌ను వాతావరణ శాఖ జారీ చేసింది. దాంతో మార్చి 21వ తేదీ వరకు రాష్ట్రంలో ఎండల తీవ్రత తగ్గుతుందని స్పష్టం చేసింది. మహారాష్ట్ర నుంచి కర్ణాటక మీదుగా తమిళనాడు వరకు ద్రోణి కొనసాగుతుందని వివరించింది.

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో…

ఇదిలా ఉండ‌గా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రెండు రోజులు వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ తెలిపింది. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో శ్రీకాకుళం, విజయనగరం, మన్యం ప్రాంతంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంది. అల్లూరి, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమలతోపాటు ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లో ఈ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

తాజావార్తలు