Homeతెలంగాణమర్రిగూడలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి

మర్రిగూడలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి

•అభివృద్ధి పనులకు శంకుస్థాపన.. ఇందిరమ్మ ఇల్లు ప్రారంభం.

మర్రిగూడ,క్రైమ్ మిర్రర్:-
మునుగోడు నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా, మర్రిగూడ మండలంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యంతో కలిసి, ఆదివారం పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ​ముందుగా సరంపేట గ్రామంలో సరంపేట నుండి శివన్నగూడెం వరకు, ఒక కోటి ఎనబై లక్షల వ్యయంతో, నిర్మించనున్న బీటీ రోడ్డు అభివృద్ధి పనులకు వారు శంకుస్థాపన చేశారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించడమే తమ లక్ష్యమని, నాణ్యతతో కూడిన రోడ్ల నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తున్నామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెలిపారు. ​అనంతరం,శివన్నగూడెం గ్రామంలో లబ్ధిదారులు మారపాకల సత్తిరెడ్డివినోద దంపతులు, నిర్మించుకున్న నూతన ఇందిరమ్మ గృహాన్ని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యంతో కలిసి ప్రారంభించారు. నిరుపేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్ల పథకం వర్తింపజేస్తామని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Free Flight Ticket Misuse: ఫ్రీ టిక్కెట్లు అమ్ముకున్న ఉద్యోగులు, 4 వేల మందిపై ఎయిర్ ఇండియా చర్యలు?

FASTag Price Hiked: వాహనదారులకు షాక్.. ఫాస్టాగ్ పాస్ ధర పెంపు!

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

తాజావార్తలు