HomeజాతీయంGATE ప్రాథమిక కీ విడుదల

GATE ప్రాథమిక కీ విడుదల

దేశవ్యాప్తంగా ఇంజినీరింగ్‌తో పాటు పలు విద్యా విభాగాల్లో ఉన్నత విద్యాభ్యాసానికి కీలకంగా భావించే జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షగా పేరుగాంచిన GATE (Graduate Aptitude Test in Engineering) 2026 పరీక్ష ఫలితాల కోసం అభ్యర్థులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో పరీక్ష నిర్వహణ బాధ్యతలు నిర్వహిస్తున్న IIT గువాహటి తాజాగా ప్రాథమిక సమాధానాల కీని విడుదల చేసింది. పరీక్ష రాసిన లక్షలాది మంది అభ్యర్థులకు ఇది కీలక దశగా భావిస్తున్నారు. ఫలితాల ప్రకటనకు ముందుగా ప్రాథమిక సమాధానాల కీని విడుదల చేయడం ద్వారా అభ్యర్థులు తమ సమాధానాలను సరిపోల్చుకునే అవకాశం కల్పించబడింది. దీనితో పాటు వారి వ్యక్తిగత ప్రతిస్పందన పట్టికలు, ప్రధాన ప్రశ్నాపత్రాలను కూడా అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. అభ్యర్థులు తమ ఎన్‌రోల్‌మెంట్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ వివరాలు నమోదు చేసి సంబంధిత పత్రాలను పొందవచ్చు.

ఫిబ్రవరి 7, 8, 14, 15 తేదీల్లో దేశంలోని అనేక పరీక్షా కేంద్రాల్లో ఈ రాత పరీక్షలు నిర్వహించబడ్డాయి. మొత్తం 30 విభాగాలకు సంబంధించిన ప్రశ్నాపత్రాలతో పరీక్షలు నిర్వహించబడిన విషయం తెలిసిందే. ప్రతి విభాగంలో విస్తృత సిలబస్ ఆధారంగా ప్రశ్నలు అడగబడగా, పోటీ తీవ్రంగా సాగింది. తాజాగా విడుదలైన ప్రాథమిక సమాధానాల కీపై అభ్యర్థులు తమ అభ్యంతరాలను తెలియజేసే అవకాశం కల్పించబడింది. నిర్దిష్ట గడువులోగా అభ్యంతరాలు సమర్పించినట్లయితే నిపుణుల బృందం వాటిని సమగ్రంగా పరిశీలిస్తుంది. ఆ తరువాత తుది సమాధానాల కీ సిద్ధం చేసి అధికారికంగా ఫలితాలను ప్రకటిస్తారు.

ఈ ఏడాది పరీక్ష ఫలితాలను మార్చి 19న విడుదల చేయనున్నట్లు నిర్వహణ సంస్థ ప్రకటించింది. దేశంలోని ప్రముఖ సాంకేతిక విద్యాసంస్థల్లో ఉన్నత విద్యకు ఇది ప్రధాన ద్వారంగా నిలుస్తుంది. కాగా గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ (గేట్), ఇంజనీరింగ్, టెక్నాలజీ, సైన్స్, కామర్స్, ఆర్ట్స్, ఆర్కిటెక్చర్, హ్యుమానిటీస్‌లలో అండర్ గ్రాడ్యుయేట్-స్థాయి సబ్జెక్టులపై దేశ వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహించే జాతీయ స్థాయి పరీక్ష ఇది. ఇందులో సాధించిన ర్యాంకు ఆధారంగా దేశంలోని ప్రముఖ సాంకేతిక విద్యాసంస్థలు, ముఖ్యంగా ఐఐటీ సహా ఇతర ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో 2026-27 విద్యా సంవత్సరానికి ఎంటెక్, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించబడతాయి. అదేవిధంగా కొన్ని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు కూడా ఈ పరీక్షలో సాధించిన స్కోర్‌ను ఆధారంగా తీసుకుని నియామకాలు చేపడతాయి.

ఈ నేపథ్యంలో ప్రాథమిక సమాధానాల కీ విడుదల కావడంతో అభ్యర్థులు తమ మార్కులపై అంచనాలు వేసుకుంటున్నారు. తుది ఫలితాల ప్రకటన వరకు ప్రతి దశ కూడా అత్యంత కీలకంగా ఉండనుంది. పోటీ తీవ్రత దృష్ట్యా ఒక్కో మార్కు కూడా అభ్యర్థుల భవిష్యత్తును ప్రభావితం చేసే అవకాశం ఉండటంతో, సమాధానాల పరిశీలనలో జాగ్రత్తగా వ్యవహరించాలని నిపుణులు సూచిస్తున్నారు. మొత్తంగా చూస్తే, జాతీయ స్థాయిలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించబడే ఈ పరీక్షలో తదుపరి దశలపై విద్యార్థుల్లో ఉత్కంఠ నెలకొంది.

ALSO READ: యూట్యూబ్‌లో దూసుకెళ్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెకండ్ సింగిల్

Shiva Krishna
Shiva Krishnahttp://www.crimemirror.com
శివకృష్ణ క్రైమ్ మిర్రర్ వెబ్‌సైట్‌లో డిజిటల్ జర్నలిస్టుగా పని చేస్తున్నారు. క్రైమ్, రాజకీయాలు, సామాజిక అంశాలు మరియు ప్రజలకు సంబంధించిన తాజా పరిణామాలపై వార్తలు, విశ్లేషణాత్మక కథనాలు రాస్తున్నారు. వార్తలను ప్రచురించే ముందు విశ్వసనీయ వనరులు, అధికారిక ప్రకటనలు మరియు అందుబాటులో ఉన్న డేటాను పరిశీలించి నిజ నిర్ధారణ (Fact-Checking) చేయడంపై ప్రత్యేక దృష్టి పెడతారు. డిజిటల్ మీడియా ప్రమాణాలను అనుసరించి స్పష్టమైన, నిజమైన మరియు సమగ్ర సమాచారాన్ని పాఠకులకు అందించడం ఆయన లక్ష్యం. వైరల్ సోషల్ మీడియా పోస్టులు, బ్రేకింగ్ న్యూస్ మరియు ప్రాంతీయ అంశాలపై పరిశీలన చేసి పాఠకులకు విశ్వసనీయమైన సమాచారం అందిస్తున్నారు. క్రైమ్ మిర్రర్లో ప్రచురితమయ్యే వార్తలు జర్నలిస్టిక్ నైతిక ప్రమాణాలు, ఖచ్చితత్వం (Accuracy), పారదర్శకత (Transparency) మరియు బాధ్యత (Accountability) సూత్రాలను పాటిస్తూ సిద్ధం చేయబడతాయి. పాఠకులకు సరైన సమాచారం చేరేలా శివకృష్ణ నిరంతరం కృషి చేస్తున్నారు.

తాజావార్తలు