Homeఆంధ్ర ప్రదేశ్బిల్ గేట్స్‌కు సీఎం చంద్రబాబు ఆత్మీయ స్వాగతం

బిల్ గేట్స్‌కు సీఎం చంద్రబాబు ఆత్మీయ స్వాగతం

అమరావతి, క్రైమ్ మిర్ర‌ర్: ఏపీలో పర్యటించేందుకు వచ్చిన గేట్స్ ఫౌండేషన్ ఛైర్మన్ బిల్ గేట్స్ సోమ‌వారం అమరావతిలోని రాష్ట్ర సచివాలయానికి చేరుకున్నారు. సచివాలయం మొదటి బ్లాకు వద్ద బిల్ గేట్స్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వాగతం పలికారు.

చంద్రబాబును చూడగానే బిల్ గేట్స్ ఆత్మీయంగా పలకరించారు. హలో ఫ్రెండ్…! హౌ ఆర్ యూ అంటూ సీఎం చంద్రబాబును బిల్ గేట్స్ అడిగారు. ఆ తర్వాత తన మంత్రివర్గ సహచరులను, సీఎస్ విజయానంద్‌ను బిల్ గేట్స్‌కు ముఖ్యమంత్రి పరిచయం చేశారు.

అంతకుముందు గన్నవరం విమానాశ్రయంలో బిల్ గేట్స్‌ను మంత్రి నారా లోకేష్ రిసీవ్ చేసుకున్నారు. విమానాశ్రయం వద్ద బిల్ గేట్స్‌కు స్వాగతం పలికిన బృందంలో మంత్రులు అచ్చెన్నాయుడు, అనిత, సత్యకుమార్, కృష్ణా జిల్లా కలెక్టర్, ఎస్పీలు ఉన్నారు.

Most Popular

Recent Comments