HomeతెలంగాణBreaking: మున్సిపల్ ఎన్నికలు సందర్బంగా అందరికి సెలవులు..!

Breaking: మున్సిపల్ ఎన్నికలు సందర్బంగా అందరికి సెలవులు..!

క్రైమ్ మిర్రర్,తెలంగాణ ఇన్వెస్టిగేషన్ బ్యూరో: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగడంతో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించి ఫిబ్రవరి 11న పోలింగ్ జరగనున్న విషయం అందరికీ తెలిసిందే.

ఓట్ల లెక్కింపు & ఫలితాలు ఫిబ్రవరి 13, 2026 (శుక్రవారం). మేయర్లు/చైర్మన్ల ఎన్నిక ఫిబ్రవరి 16, 2026. ఎన్నికల నేపథ్యంలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ప్రభుత్వం ప్రత్యేక సెలవులను ప్రకటించే అవకాశం ఉంది అని తెలుస్తుంది. పోలింగ్ రోజు (ఫిబ్రవరి 11) ఓటింగ్ జరిగే ప్రాంతాల్లోని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలకు సాధారణ సెలవు ప్రకటించే అవకాశం ఉంది.

పోలింగ్ కేంద్రాలుగా ఉన్న పాఠశాలలకు ఫిబ్రవరి 11తో పాటు, ఎన్నికల ఏర్పాట్ల కోసం ముందు రోజు లేదా కౌంటింగ్ రోజు (ఫిబ్రవరి 13) కూడా సెలవు ఇచ్చే యోచనలో ప్రభుత్వం ఉంది అని తెలుస్తుంది. హైదరాబాద్ (GHMC), వరంగల్, ఖమ్మం వంటి ప్రధాన కార్పొరేషన్లకు ప్రస్తుతం ఎన్నికలు లేవు, కాబట్టి ఆ ప్రాంతాల్లో ఈ సెలవులు వర్తించకపోవచ్చు.

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

తాజావార్తలు