Homeఆంధ్ర ప్రదేశ్జర్నలిస్టుల సమస్యల ను ప‌రిష్క‌రిస్తా...

జర్నలిస్టుల సమస్యల ను ప‌రిష్క‌రిస్తా…

  • మండ‌లంలో ప్రెస్‌క్ల‌బ్ ఏర్పాటుకు కృషి చేస్తా
  • ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి

సి.బెళగల్, క్రైమ్ మిర్ర‌ర్ః సి.బెళ‌గ‌ల్ మండ‌ల‌ ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ ఫోరం మండల కమిటీ సభ్యులు ఎమ్మెల్యే బొగ్గుల ద‌స్త‌గిరిని ప‌సుప‌ల గ్రామంలో మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. అనంతరం కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను శాలువా వేసి, గజమాలతో సత్కరించారు.

ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్యే కమిటీ సభ్యులతో మాట్లాడారు. జర్నలిస్టుల సమస్యల ను ప‌రిష్క‌రిస్తాన‌న్నారు. అదేవిధంగా జర్నలిస్టుల కోసం ప్రెస్ క్లబ్ ను అడగగా సానుకూలంగా స్పందించి మండలంలో ప్రెస్ క్లబ్ ను ఏర్పాటు చేస్తానని కమిటీ సభ్యులకు హామీ ఇచ్చారు.

ఎమ్మెల్యే హామీ ఇవ్వడంతో కమిటీ సభ్యులు ఆనందాన్ని వ్యక్తం చేశారు.

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

తాజావార్తలు