HomeతెలంగాణMaganti Sunitha: జూబ్లీహిల్స్ ఎన్నికలు రౌడీ రాజ్యంలో జరిగాయి

Maganti Sunitha: జూబ్లీహిల్స్ ఎన్నికలు రౌడీ రాజ్యంలో జరిగాయి

Maganti Sunitha: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో ఓటమి నేపథ్యంలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. కాంగ్రెస్ గెలుపును ఆమె తీవ్రంగా నిరసిస్తూ, ఈ ఎన్నికలు పూర్తిగా అప్రజాస్వామిక వాతావరణంలో జరిగాయని ఆరోపించారు. రౌడీలతో భయపెట్టి ఓట్లను ప్రభావితం చేశారని, అనేక రిగ్గింగ్ ఘటనలు చోటుచేసుకున్నాయని తీవ్ర విమర్శలు చేశారు. నాలుగు, ఐదు పార్టీలు కలసి పోటీ చేసిన సందర్భంలో తాను ఒంటరిగా బరిలో దిగినా నైతిక విజయం బీఆర్ఎస్‌దే అని స్పష్టం చేశారు. పోలింగ్ రోజు గొడవలు, బెదిరింపులు, కౌంటింగ్ సెంటర్‌లో ర్యాగింగ్ జరిగాయని ఆమె ఆరోపించడంతో పరిస్థితులు మరింత ఉద్రిక్తతకు దారితీశాయి.

తమ పార్టీ నాయకులు, కార్యకర్తలు బెదిరింపులకు గురయ్యారని, ఎన్నికల కమిషన్ పూర్తిగా వైఫల్యం చెందినదని సునీత వ్యాఖ్యానించారు. గోపినాథ్ హయాంలో శాంతిగా ఉన్న జూబ్లీహిల్స్, ఇప్పుడు రౌడీయిజానికి అడ్డాగా మారిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని అభినందిస్తూ, తాను ఎల్లప్పుడూ ప్రజా సేవలో అందుబాటులో ఉంటానని తెలిపారు. స్వర్గీయ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ ఆశయాల కోసం ముందుకుసాగుతానని ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

ALSO READ: జూబ్లీహిల్స్‌ ఓటమిపై కిషన్ రెడ్డి స్పందన

Shiva Krishna
Shiva Krishnahttp://www.crimemirror.com
శివకృష్ణ క్రైమ్ మిర్రర్ వెబ్‌సైట్‌లో డిజిటల్ జర్నలిస్టుగా పని చేస్తున్నారు. క్రైమ్, రాజకీయాలు, సామాజిక అంశాలు మరియు ప్రజలకు సంబంధించిన తాజా పరిణామాలపై వార్తలు, విశ్లేషణాత్మక కథనాలు రాస్తున్నారు. వార్తలను ప్రచురించే ముందు విశ్వసనీయ వనరులు, అధికారిక ప్రకటనలు మరియు అందుబాటులో ఉన్న డేటాను పరిశీలించి నిజ నిర్ధారణ (Fact-Checking) చేయడంపై ప్రత్యేక దృష్టి పెడతారు. డిజిటల్ మీడియా ప్రమాణాలను అనుసరించి స్పష్టమైన, నిజమైన మరియు సమగ్ర సమాచారాన్ని పాఠకులకు అందించడం ఆయన లక్ష్యం. వైరల్ సోషల్ మీడియా పోస్టులు, బ్రేకింగ్ న్యూస్ మరియు ప్రాంతీయ అంశాలపై పరిశీలన చేసి పాఠకులకు విశ్వసనీయమైన సమాచారం అందిస్తున్నారు. క్రైమ్ మిర్రర్లో ప్రచురితమయ్యే వార్తలు జర్నలిస్టిక్ నైతిక ప్రమాణాలు, ఖచ్చితత్వం (Accuracy), పారదర్శకత (Transparency) మరియు బాధ్యత (Accountability) సూత్రాలను పాటిస్తూ సిద్ధం చేయబడతాయి. పాఠకులకు సరైన సమాచారం చేరేలా శివకృష్ణ నిరంతరం కృషి చేస్తున్నారు.

తాజావార్తలు