Homeతెలంగాణజీహెచ్‌ఎంసీ(GHMC) వాహనంపై విరిగిపడ్డ కొండచరియలు

జీహెచ్‌ఎంసీ(GHMC) వాహనంపై విరిగిపడ్డ కొండచరియలు

హైదరాబాద్‌ (క్రైమ్ మిర్రర్): నిన్న సాయంత్రం హైదరాబాద్‌లో కురిసిన బారి వర్షం మల్కాజిగిరి ప్రాంతంలో కలకలం రేపింది. గౌతమ్‌నగర్‌లో ఉన్న ఒక కొండచరియ వర్షపు నీటితో కూలి జీహెచ్‌ఎంసీ (GHMC) వాహనంపై పడింది. అదృష్టవశాత్తు ఆ సమయంలో వాహనంలో ఎవరూ లేకపోవడంతో ఒక పెద్ద ప్రమాదం తప్పింది.

స్థానికుల సమాచారం మేరకు, గౌతమ్‌నగర్‌లోని కొండ ప్రక్కన పార్క్ చేసి ఉంచిన GHMC మలినాల రవాణా వాహనం పైకి భారీ రాళ్లు, మట్టి జారిపడ్డాయి. కొండచరియల బరువుతో వాహనం కొంతమేరకు దెబ్బతిన్నా, ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.

Also Read:నాపై సోషల్ మీడియాలో వచ్చే దుష్ప్రచారాలను నమ్మొద్దు : ఎమ్మెల్యే కోమటిరెడ్డి

వెంటనే సమాచారం అందుకున్న మల్కాజిగిరి మున్సిపల్ అధికారులు, GHMC విభాగ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని కొండప్రాంతాన్ని సర్వే చేశారు. ప్రమాదం చోటుచేసుకున్న ప్రాంతాన్ని చుట్టూ బారికేడ్లు ఏర్పాటు చేసి, మరిన్ని రాళ్లు జారిపోకుండా జాగ్రత్త చర్యలు చేపట్టారు.

స్థానికులు తెలిపినట్లుగా, గౌతమ్‌నగర్‌లోని ఈ కొండప్రాంతం ప్రతిసారీ వర్షాకాలంలో ప్రమాదానికి గురవుతుంటుందని, ఇప్పటికైనా GHMC శాశ్వత రక్షణ గోడలు నిర్మించాలి అని కోరుతున్నారు.

Also Read:జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

తాజావార్తలు