Tuesday, March 17, 2026
Homeజాతీయంమృతదేహాల గుర్తింపులో జాప్యం, కన్నీటితో బంధువుల ఎదురు చూపులు!

మృతదేహాల గుర్తింపులో జాప్యం, కన్నీటితో బంధువుల ఎదురు చూపులు!

Ahmedabad Plane Crash: అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో చనిపోయిన ప్రయాణీకుల మృతదేహాలను గుర్తించేందుకు డీఎన్ఏ పరీక్షలు కొనసాగుతున్నాయి. అహ్మదాబాద్ లోని బీసే మెడికల్ కాలేజీలో మృతుల బంధువుల నుంచి డీఎన్ఏ శాంపిల్స్ సేకరిస్తున్నారు. మాంసపు ముద్దులుగా మారని మృదేహాల గుర్తింపు కోసం డీఎన్ఏ పరీక్షలు జరుపుగుతున్నారు. విమాన ప్రమాదం జరిగి 2 రోజులు అవుతున్నా, మృతదేహాల గుర్తింపు ప్రక్రియ చాలా కష్టతరంగా మారింది. తమ కుటుంబ సభ్యుల మృతదేహాల కోసం కుటుంబ సభ్యులు హాస్పిటల్ ఎదుట కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. విమాన ప్రమాదంలో మొత్తం 241 మంది చనిపోగా, ఇప్పటి వరకు కేవలం 7 మృతదేహాలు మాత్రమే గుర్తించారు. వాటిని కుటుంబ సభ్యులకు అందజేశారు.

బాధితుల కుటుంబ సభ్యుల నుంచి డీఎన్ఏ సేకరణ

మృతదేహాల గుర్తింపు కోసం డీఎన్‌ఏ పరీక్షలు తప్పనిసరి అయ్యాడు. మృతదేహాలు అన్నీ కాలిన ముద్దలు కావడంతో గుర్తింపు ప్రక్రియకు డీఎన్ఏ పరీక్ష ఒకటే దారిగా మారింది. ఇందుకోసం చనిపోయిన వారి కుటుంబ సభ్యులు డీఎన్ఏ శాంపిల్స్ అందిస్తున్నారు. తన తండ్రి మృతదేహం కోసం ఓ 8 ఏళ్ల బాలుడు కూడా రక్త నమూనాలు ఇవ్వడం అందరినీ కంటతడి పెట్టింది.

డీఎన్ఏ రిపోర్టు కోసం 72 గంటల సమయం

మృతుల బంధువుల నుంచి సేకరించిన రక్త నమూనాలకు సంబంధించిన డీఎన్ఏ రిపోర్టు వచ్చేందుకు కనీసం 72 గంటల సమయం పడుతుంది. ఈ నేపథ్యంలో మృతదేహాల కోసం ఎదరు చూపులు తప్పని పరిస్థితి నెలకొంది. అహ్మదాబాద్ మెడికల్ కాలేజీ దగ్గర బంధువుల రోదనలో విషాద ఛాయలు అలుముకున్నాయి. బాధిత కుటుంబ సభ్యులు  మృతదేహాల కోసం పెద్ద సంఖ్యలో ఎదురు చూస్తున్నారు. మరోవైపు మృతదేహాల్లో సగానికి పైగా దంత నమూనాలను సేకరించినట్లు ఫోరెన్సిక్ వైద్యులు తెలిపారు. త్వరలోనే అందరి శాంపిల్స్ సేకరిస్తామన్నారు.

అహ్మదాబాద్ నుంచి లండన్ కు వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం, అహ్మదాబాద్ లో టేకాఫ్ అయిన కాసేపటికే సమీపంలోని మెడికల్ కాలేజీ మీద పడిపోయింది. ఈ ప్రమాదంలో విమానంలోని 241 మంది చనిపోగా, ఓ ప్రయాణీకుడు ప్రాణాలతో బయటపడ్డాడు.

Read Also: బోయింగ్ విమాలు సేఫేనా? అనుమానాలకు సమాధానాలేవి?

Anjibabu Chittimalla
Anjibabu Chittimallahttps://crimemirror.com/
గత 16 సంవత్సరాలుగా మీడియా రంగంలో పని చేస్తున్నాను. ABN ఆంధ్రజ్యోతి, టీ-న్యూస్‌, వెలుగు దినపత్రిక, V6 చానెల్ లో జర్నలిస్టుగా పని చేశాను.2022 నుంచి 2024 వరకు ‘ABP దేశం’కు ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పని చేశాను. BIG TVకి ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా ట్రావెల్, వైరల్, లైఫ్ స్టైల్, టెక్ అండ్ సైన్స్, ఆటో, క్రైమ్ వార్తలు అందించాను.ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నాను.
RELATED ARTICLES

Most Popular

Recent Comments