Homeలైఫ్ స్టైల్జాగ్రత్త: ఈ చిన్న అలవాట్లే మీ దంతాలను పాడుచేస్తాయి!

జాగ్రత్త: ఈ చిన్న అలవాట్లే మీ దంతాలను పాడుచేస్తాయి!

క్రైమ్ మిర్రర్,హెల్త్:- మనం రోజూవారీ జీవితంలో చేసే కొన్ని చిన్న చిన్న పొరపాట్లు లేదా అలవాట్లు మన దంతాల ఆరోగ్యానికి ఎంత ప్రమాదకరమో వైద్యులు హెచ్చరిస్తున్నారు. దంతాలను శుభ్రంగా ఉంచుకోవడమే కాకుండా, మన దైనందిన అలవాట్లపై కూడా దృష్టి సారించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేస్తున్నారు.కూల్ డ్రింక్స్, జ్యూస్‌లతో జాగ్రత్తఅనేకమందికి కూల్ డ్రింక్స్, పండ్ల రసాలు తాగే అలవాటు ఉంటుంది. అయితే, వీటిని రోజంతా కొద్దికొద్దిగా సిప్ చేస్తూ తాగడం వల్ల దంతాలపై ఉండే ఎనామిల్ దెబ్బతింటుంది. అలాగే, ఈ పానీయాలు తాగిన వెంటనే నీటితో పుక్కిలించకపోవడం వల్ల దంతాల పసుపు రంగులోకి మారడం, పుచ్చిపోవడం లాంటి సమస్యలు తలెత్తుతాయి. ఈ పానీయాలలో ఉండే ఆమ్లాలు, చక్కెరలు ఎనామిల్‌ను వేగంగా కరిగిస్తాయి.పళ్లు కొరికే అలవాటు ఉందా?చాలామందికి కోపం వచ్చినప్పుడు లేదా తీవ్ర ఒత్తిడి, ఆందోళనగా ఉన్నప్పుడు పళ్లు కొరికే అలవాటు ఉంటుంది. దీనివల్ల పంటి పైభాగంలో ఉండే ఎనామిల్ అరిగిపోయి, దంతాలు సెన్సిటివ్‌గా మారుతాయి. అంతేకాకుండా, తీవ్రంగా కొరికితే దంతాలు విరిగిపోయే ప్రమాదం కూడా ఉందని దంత వైద్యులు హెచ్చరిస్తున్నారు.పళ్లను టూల్స్‌లా వాడకండికొందరు నీళ్ల బాటిల్ మూతలు తీయడానికి, చిప్స్ ప్యాకెట్లు లేదా ఇతర వస్తువుల కవర్లు చించడానికి పళ్లను ఉపయోగిస్తుంటారు. ఇలా చేయడం వల్ల పళ్లలో పగుళ్లు రావడం, దంతాలు బలహీనపడటం జరుగుతుంది. దంతాలు కేవలం ఆహారం నమలడానికి మాత్రమేనని, వాటిని ఇతర పనులకు ఉపయోగించకూడదని గుర్తుంచుకోవాలి.నోటితో గాలి పీలుస్తున్నారా?కొందరు ముక్కుకు బదులు నోటి ద్వారా గాలి పీలుస్తుంటారు. ఇలా చేయడం వల్ల నోరు ఎండిపోయి, లాలాజలం ఉత్పత్తి తగ్గుతుంది. లాలాజలం దంతాలను శుభ్రపరచడంలో, ఆమ్లాలను తటస్థీకరించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. నోరు పొడిబారడం వల్ల బ్యాక్టీరియా పెరిగి దంతాలు పుచ్చిపోవడానికి దారితీస్తుందని నిపుణులు వివరిస్తున్నారు.కాబట్టి, ఆరోగ్యకరమైన దంతాల కోసం మంచి అలవాట్లను పెంపొందించుకోవాలి. ప్రతిరోజూ రెండుసార్లు బ్రష్ చేయడంతో పాటు, పైన పేర్కొన్న చెడు అలవాట్లకు దూరంగా ఉండటం ద్వారా దంత సమస్యలను నివారించవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.

తెలంగాణ ప్రజలకు అందుబాటులో ఫ్యామిలీ సర్టిఫికెట్…!

ఫుల్ రేంజ్ లో లోకేష్ పాలిటిక్స్…!

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు