Saturday, March 21, 2026
Homeతెలంగాణబస్ పాస్ చార్జీల బాదుడు, ఏకంగా 20 శాతం పెంపు!

బస్ పాస్ చార్జీల బాదుడు, ఏకంగా 20 శాతం పెంపు!

TGSRTC Hike Bus Pass Fares: తెలంగాణ ఆర్టీసీ మరోసారి ఛార్జీల మోత మోగించింది. ఈసారి బస్‌ పాస్‌ ఛార్జీలను భారీగా పెంచింది. విద్యార్థులు, ఉద్యోలుగు, సాధారణ ప్రజల బస్ పాస్ ఛార్జీలను ఏకంగా 20 శాతానికి పైగా పెంచింది. ఈ ధరలను తక్షణమే అమల్లోకి తీసుకొచ్చింది. ఇంతకీ ధరల పెంపు ఎలా ఉందంటే..

విద్యార్థుల రూట్ పాస్ ధరల పెంపు ఇలా!

హైదరాబాద్, వరంగల్ విద్యార్థులకు రూట్‌ పాస్‌ ప్రస్తుతం 4 కిలోమీటర్ల వరకు రూ.150 వసూలు చేస్తుండగా ఆ మొత్తాన్ని రూ.225కి పెంచింది.  రూట్‌ పాస్‌ గరిష్ఠంగా 22 కి.మీ.కు రూ.450 ఉండగా దాన్ని రూ.675కి పెంచుతూ నిర్ణయించింది.  ఇతర జిల్లాల్లో ప్రతి నెలా రూట్‌ పాస్ కు 5 కి.మీ. వరకు రూ.150 ఉండగా, దాన్ని రూ.225కి పెంచుతూ నిర్ణయించింది.  గరిష్ఠంగా 35 కి.మీ.కు రూ.550 ఉండగా రూ.825కి పెంచినట్లు వెల్లడించింది. ఇక విద్యార్థుల నెలవారీ సాధారణ పాస్‌ రూ.400 ఉండగా, దానిని రూ.600కు పెంచారు. 3 నెలలకు రూ.1200 నుంచి రూ.1800కు హైక్ చేసింది.

ఇకపై మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సుల్లోనూ అనుమతి

విద్యార్థుల బస్‌ పాస్‌ చార్జీలు పెద్ద మొత్తంలో పెంచినప్పటికీ.. హైదరాబాద్‌ లో మెట్రో ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లోనూ అనుమతించనున్నట్లు ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. ఉదయం, సాయంత్రం వేళల్లో రద్దీ ఎక్కువగా నేపథ్యంలో, ఆ సమస్యలను అధిగమించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.  విద్యార్థుల బస్‌పాస్‌ చార్జీలు గత మూడేళ్లుగా పెరగలేదు. ఈ నేపథ్యంలో రేవంత్ సర్కారు భారీగా పెంచింది.  ప్రస్తుతం పెరిగిన ఖర్చుల కారణంగా విద్యార్థి, సాధారణ ప్రయాణికుల బస్ పాస్ ధరలు పెంచినట్లు అధికారులు వెల్లడించారు. తాజాగా పెంచిన ధరలతో ఆర్టీసీకి  ప్రతి నెలా సుమారు రూ. 2 కోట్లు ఆదాయం వస్తుందని ఆర్టీసీ అధికారులు తెలిపారు. అయితే, ఈ పెంపు సాధారణ విద్యార్థులకు భారంగా మారనుంది. ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు 11 లక్షల విద్యార్థి బస్ పాస్ లు ఉన్నాయి.  ఆర్టీసీకి ప్రతి నెల సుమారు రూ.2 కోట్ల వరకు ఆదాయం సమకూరనుంది. కాగా, ఈ పెంపు విద్యార్థుల తల్లిదండ్రులకు ఆర్థికంగా భారం కానుంది. రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల బస్ పాస్ లు సుమారు 11 లక్షల వరకు ఉన్నాయి.

Read Also: జూన్ 14 వరకు భారీ వర్షాలు, తెలుగు రాష్ట్రాల పరిస్థితి ఏంటి?

Anjibabu Chittimalla
Anjibabu Chittimallahttps://crimemirror.com/
గత 16 సంవత్సరాలుగా మీడియా రంగంలో పని చేస్తున్నాను. ABN ఆంధ్రజ్యోతి, టీ-న్యూస్‌, వెలుగు దినపత్రిక, V6 చానెల్ లో జర్నలిస్టుగా పని చేశాను.2022 నుంచి 2024 వరకు ‘ABP దేశం’కు ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పని చేశాను. BIG TVకి ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా ట్రావెల్, వైరల్, లైఫ్ స్టైల్, టెక్ అండ్ సైన్స్, ఆటో, క్రైమ్ వార్తలు అందించాను.ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నాను.
RELATED ARTICLES

Most Popular

Recent Comments