Homeజాతీయంవామ్మో అయోధ్య, భూములకు ఇంత ధరా?

వామ్మో అయోధ్య, భూములకు ఇంత ధరా?

Ayodhya’s land value soars: ఉత్తర ప్రదేశ్ లో భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. ముఖ్యంగా అయోధ్య పరిసరాల్లో రేట్లు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఏకంగా 30 నుంచి 200 శాతం పెంచారు. గత 8 సంవత్సరాల్లో భూముల రేట్లను పెంచడం ఇదే తొలిసారి. కొత్త రేట్లు తాజాగా అమల్లోకి వచ్చాయి.

10 కిలో మీటర్ల వరకు పెరిగిన ధరలు

అయోధ్య భవ్య రామ మందిరం నిర్మాణం తర్వాత బాల రాముడిని దర్శించుకునేందకు లక్షలాది భక్తులు తరలివస్తున్నారు. దేశ విదేశాల నుంచి నిత్యం వేలాదిగా వచ్చి శ్రీరామ జన్మస్థానాన్ని చూసి పరవశిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆలయ చుట్టుపక్కల 10 కిలో మీటర్ల వరకు తాజాగా పెంచిన రేట్ల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అక్కడ భూముల ధరలు 150 శాతానికి పైగా పెంచినట్లు అధికారులు వెల్లడించారు.

సోమవారం నుంచి కొత్త రేట్లు అమలు

2004 సెప్టెంబర్‌లో భూముల ధరల పెంపు కోరుతూ తమకు ప్రతిపాదనలు వచ్చినట్లు ఫైజాబాద్ సబ్‌ రిజిస్ట్రార్ శాంతి భూషణ్ చౌబే తెలిపారు. ఆ ప్రతిపాదనల ప్రకారం ధరలను పెంచినట్లు తెలిపారు. కొత్త సర్కిల్ రేట్లకు జిల్లా మెజిస్ట్రేట్ ఆమోద ముద్ర వేశారు. ఈ నేపథ్యంలో సోమవారం నుంచి కొత్త ధరలు అమల్లోకి వచ్చాయి. కొత్త రేట్ల ప్రకారం రాకాబ్‌ గంజ్, దేవ్‌ కాళి ప్రాంతాల్లో భూముల రేట్లు భారీగా పెరగనున్నాయి.

చదరపు మీటరు ధర రూ.27,900

అయోధ్య రామాలయం ప్రారంభం తర్వాత ఆధ్యాత్మక పర్యటనా కేంద్రంగా ఆకట్టుకుంటుంది. మౌలిక వసతు కల్పన కారణంగా రామాలయం చుట్టూ ఉన్న సర్కిల్ రేట్లు చదరపు మీటరుకు ఏకంగా రూ.26,660 నుంచి రూ.27,900 వరకూ పెరుగుతుందని సబ్ రిజిస్ట్రార్ అధికారులు చెప్పారు. గతంలో ఈ రేటు రూ.6,650 నుంచి రూ.6,975 వరకు ఉండేది. ల్యాండ్ రెసిడెన్షియల్, కమర్షియల్, అగ్రికల్చరల్ అనే కేటిగిరిల కింద వివిధ రేట్లలో భూముల పెరుగుదల ఉంటుందని వెల్లడించారు.

Read Also: బస్ పాస్ చార్జీల బాదుడు, ఏకంగా 20 శాతం పెంపు!

Anjibabu Ch
Anjibabu Chhttps://crimemirror.com/
గత 15 సంవత్సరాలుగా మీడియా రంగంలో ఉన్నారు. పలు ప్రముఖ మీడియా సంస్థల్లో పని చేశారు. ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నారు. రాజకీయాల నుంచి సినిమాల వరకు.. నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ వరకు.. స్పోర్ట్స్ నుంచి క్రైమ్ వరకు అన్ని రకాల కథనాలు అందిస్తున్నారు.

తాజావార్తలు