Friday, March 13, 2026
Homeతెలంగాణఎల్బీనగర్ నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తలతో విస్తృత సమావేశం

ఎల్బీనగర్ నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తలతో విస్తృత సమావేశం

ఎల్బీనగర్, క్రైమ్ మిర్రర్ : ఎల్బీనగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం ఈరోజు ఘనంగా నిర్వహించబడింది. ఈ సమావేశానికి టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ అధ్యక్షత వహించారు.

సాగర్ రింగ్ రోడ్ చౌరస్తా సమీపంలోని వన్ కన్వెన్షన్ హాల్‌లో జరిగిన ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ రంగారెడ్డి జిల్లా పరిశీలకులు, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ చైర్మన్ శివసేన రెడ్డి హాజరయ్యారు.

ఈ కార్యక్రమంలో పార్టీ కీలక నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. నియోజకవర్గ స్థాయిలో పార్టీకి మరింత బలం చేకూర్చేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సుదీర్ఘంగా చర్చ జరిగింది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments