-
పసునూరు గ్రామ సభలో సీఐ దూది రాజు.
-
అరైవ్ అలైవ్ కార్యక్రమంపై ప్రజలకు అవగాహన.
-
శాంతిభద్రతల్లో రాజీ లేదు, సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండండి
నాంపల్లి(క్రైమ్ మిర్రర్): గ్రామ అభివృద్ధి, శాంతిభద్రతలు, సామాజిక బాధ్యతపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు, నాంపల్లి మండలం పసునూరు గ్రామంలో నిర్వహించిన, గ్రామ సభలో నాంపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ దూది రాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గ్రామస్తులను ఉద్దేశించి మాట్లాడిన సీఐ రాజు, పల్లెలు బాగుంటేనే అన్నదాత బాగుంటాడు. అన్నదాత బాగుంటేనే దేశం బాగుంటుందన్నారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే దేశాభివృద్ధికి పునాది అంటూ ప్రసంగించారు..
—అరైవ్ అలైవ్ కార్యక్రమంతో ప్రజల ప్రాణాలకు రక్షణ
గ్రామ సభలో సీఐ దూది రాజు మరో కీలక అంశంపై ప్రజలకు అవగాహన కల్పించారు. అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా రోడ్డు భద్రత ప్రాముఖ్యతను వివరించారు. ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడం వల్లే ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారని, ఎంతో మంది శరీర భాగాలు తీవ్రంగా దెబ్బతిని ఇబ్బంది పడ్డారని గుర్తుచేశారు.
Also Read: క్యాబినెట్ లోకి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి!!!
ద్విచక్ర వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్ ధరించడం తప్పనిసరని, డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే ప్రాణాలతో పాటు, కుటుంబ భవిష్యత్తు కూడా నాశనమవుతుందన్నారు. మితిమీరిన వేగం వల్ల ఒక్క క్షణంలో కుటుంబం రోడ్డున పడుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
డ్రైవింగ్ చేసే క్రమంలో సెల్ఫ్ డిఫెన్స్ పద్ధతిలో, వాహనాన్ని నియంత్రించేలా డ్రైవింగ్ చేయాలని సూచించారు. అరైవ్ అలైవ్ ప్రోగ్రాంతో రోడ్డు ప్రమాదాలను గణనీయంగా అరికట్టవచ్చన్నారు. ఇది పోలీసుల బాధ్యత మాత్రమే కాదు, ప్రతి ఒక్కరి బాధ్యతని ఆయన గుర్తు చేశారు.
–శాంతిభద్రతల్లో వెనక్కి తగ్గేది లేదు
లా అండ్ ఆర్డర్ నియంత్రణలో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేసిన ఆయన, ప్రజలకు రక్షణ కల్పించడంలో పోలీసు శాఖ పూర్తి కట్టుబడి ఉందన్నారు. అనుమానిత కార్యకలాపాలు, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం, గంజాయి వంటి మత్తు పదార్థాల వినియోగం కనిపిస్తే, వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.
Also Read: లోక్ సభ డిప్యూటీ స్పీకర్ గా పురందేశ్వరి…!
క్షణికావేశంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని సూచించిన సీఐ, భూ తగాదాల వంటి సమస్యలకు కోర్టు ద్వారానే న్యాయపరమైన పరిష్కారం పొందవచ్చని తెలిపారు. ప్రజలకు ఏదైనా సమస్య వస్తే పోలీసులు ఉన్నారనే విషయాన్ని మర్చిపోవద్దన్నారు. మేము ఎల్లప్పుడూ మీకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
—సైబర్ మోసాలపై హెచ్చరిక
ప్రస్తుతం పెరుగుతున్న సైబర్ నేరాల పట్ల ప్రజలను అప్రమత్తం చేసిన ఆయన, ఎవరికీ ఓటీపీ, బ్యాంక్ వివరాలు చెప్పవద్దని సూచించారు. బ్యాంక్ సిబ్బంది ఎప్పుడూ ఫోన్లో ఓటీపీ అడగరని, తెలియని లింక్లు క్లిక్ చేయడం, తెలియని వారికి వివరాలు ఇవ్వడం వల్ల మోసపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. యువత ఆదర్శంగా ఉండాలని, చెడు వ్యసనాలకు బానిస కాకుండా పుట్టిన ఊరికి, కన్నవారికి మంచి పేరు తీసుకురావాలని సీఐ దూది రాజు పిలుపునిచ్చారు.