Homeఆంధ్ర ప్రదేశ్వంగవీటి ఆశాకిరణ్ పొలిటికల్ ఎంట్రీ...!

వంగవీటి ఆశాకిరణ్ పొలిటికల్ ఎంట్రీ…!

  • వంగవీటి ఆశాకిరణ్ పొలిటికల్ ఎంట్రీ…!

  • విజయవాడ నుంచి బరిలో రంగా వారసురాలు

  • సెంట్రల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు యత్నాలు

  • త్వరలో కార్యాలయం ప్రారంభం

క్రైమ్ మిర్రర్, విజయవాడ: వంగవీటి మోహన్ రంగా వారసురాలు ఆశా కిరణ్ పొలిటికల్ అడుగులు వేస్తున్నారా? వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం ఖాయమా? ఇప్పటినుంచి ఆమె సన్నాహాలు ప్రారంభించారా? అయితే ఏ నియోజకవర్గంలో నుంచి పోటీ చేస్తారు? ఎక్కడి నుంచి బరిలో దిగుతారు? పొలిటికల్ వర్గాల్లో ఇదే ఆసక్తికర చర్చ. గత కొంతకాలంగా ఆమె క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు.

రంగా- రాధ మిత్రమండలి బలోపేతానికి కృషి చేస్తున్నారు. ఇప్పటికిప్పుడు రాజకీయాల్లోకి రానని స్పష్టం చేశారు ఆమె. కానీ తెర వెనుక పొలిటికల్ ఎంట్రీ కి గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేసుకుంటున్నట్లు ప్రచారం నడుస్తోంది.

కుటుంబమంతా తూర్పు నియోజకవర్గం నుంచి..

వంగవీటి మోహన్ రంగా 1989లో తొలిసారిగా విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన అకాల మరణంతో భార్య రత్నకుమారి అదే నియోజకవర్గంలో నుంచి పోటీ చేసి గెలిచారు. రెండోసారి కూడా విజయం సాధించారు. ఆమె అనంతరం కుమారుడు వంగవీటి రాధాకృష్ణ 2004లో అదే తూర్పు నియోజకవర్గం నుంచి గెలిచారు కాంగ్రెస్ పార్టీ తరఫున. 2009లో ప్రజారాజ్యం పార్టీ తరపున పోటీ చేసి ఓడిపోయారు.

2014లో మాత్రం సెంట్రల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయనకు ఓటమి తప్పలేదు. 2019 ఎన్నికల కు ముందు తెలుగుదేశం పార్టీలో చేరారు. కానీ ఇప్పటివరకు ఎన్నికల్లో పోటీ చేయలేదు ఆ పార్టీ తరఫున. అయితే ఇప్పుడు వంగవీటి ఆశాకిరణ్ పొలిటికల్ ఎంట్రీ తో .. ఆమె విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారా అన్న టాక్ నడుస్తోంది.

తెర వెనుక సన్నాహాలు

అయితే తన కుటుంబానికి కలిసి వచ్చిన విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి కాకుండా.. సెంట్రల్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారన్న ప్రచారం మొదలైంది. ఆమె గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేసుకుంటున్నట్లు టాక్ నడుస్తోంది. సెంట్రల్ నియోజకవర్గం పరిధిలోని గాంధీ నగర్ లో త్వరలో కార్యాలయం కూడా ప్రారంభిస్తారని తెలుస్తోంది.

ఆమె ఇప్పటికే జనసేనతో పాటు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి టచ్ లో ఉన్నట్లు పొలిటికల్ వర్గాల్లో ఒక టాక్ ఉంది. ప్రస్తుతం ఆమె సోదరుడు వంగవీటి రాధాకృష్ణ తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్నారు. త్వరలో ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఖాయమన్న టాక్ నడుస్తోంది. మరి ఆ ప్రభావం ఆమెపై ఉండబోతుందా? లేకుంటే ఆమె స్వతంత్రంగా వ్యవహరించి నచ్చిన పార్టీలో చేరుతారా? అన్నది తెలియాల్సి ఉంది.

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

తాజావార్తలు