Homeఆంధ్ర ప్రదేశ్జగన్ కోర్ టీం ఔట్...!

జగన్ కోర్ టీం ఔట్…!

  • జగన్ కోర్ టీం ఔట్…!

  • మద్యం కుంభకోణంలో అడ్డగోలుగా సంపాదన

  • పునరాలోచనలో వైసీపీ అధినేత

  • ధర్మాన, బొత్స, పెద్దిరెడ్డిలకు పిలుపు

క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో: వైయస్ జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తన చుట్టూ ఉన్న మార్చనున్నట్లు సమాచారం. తన చుట్టూ ఉన్న కోటరీతో ఇబ్బందికర పరిస్థితులు వస్తున్నాయని తెలిసి ఆయన కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది పాదయాత్ర నాటికి కొత్త కోర్ టీం రానున్నట్లు సమాచారం.

జగన్మోహన్ రెడ్డి చుట్టూ నిత్యం చాలామంది నేతలు ఉంటూ వస్తున్నారు. అయితే వారితో ఇబ్బందులు కలగడమే కాకుండా.. తన పేరు చెప్పి భారీ దోపిడీకి పాల్పడ్డారని తెలియడంతో జగన్మోహన్ రెడ్డి ఈ నిర్ణయానికి వచ్చినట్లు పొలిటికల్ వర్గాల్లో ప్రచారం నడుస్తోంది. ముఖ్యంగా మద్యం కుంభకోణం వెలుగు చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డిలో సరికొత్త అనుమానాలు తలెత్తాయి. అందుకే తన చుట్టూ ఉన్న వారిని మార్చే ప్రయత్నంలో ఉన్నట్లు తెలుస్తోంది.

వ్యక్తిగత పిఏ సంపాదన..
వైయస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లో క్రియాశీలకం అయిన తర్వాత ఆయన వ్యక్తిగత సహాయకుడిగా చేరారు నాగేశ్వర్ రెడ్డి. కేఎన్ఆర్ గా పిలవబడే ఆయన పిఏ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా కొనసాగారు. మొన్నటి ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కూడా జగన్ వెంట కనిపించారు. అయితే ఇటీవల ఆయన మద్యం కుంభకోణంలో అడ్డంగా బుక్కయ్యారు.

Also Read:అప్పుడు కెసిఆర్.. ఇప్పుడు రేవంత్.. టార్గెట్ కిషన్ రెడ్డి!!

దర్యాప్తు బృందం విచారణలో వందల కోట్ల ఆస్తులు బయటపడ్డాయి. అయితే అదంతా జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా కేఎన్ఆర్ అక్రమాలకు పాల్పడ్డారని వైసిపి వర్గాలు భావిస్తున్నాయి. నిత్యం తన చుట్టూ ఉంటూనే ఇంత అవినీతికి పాల్పడ్డారా అంటూ జగన్మోహన్ రెడ్డి సైతం ఆశ్చర్యపోయినట్లు తెలుస్తోంది.

అధికారులుగా ఉంటూ..
జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఓఎస్డిగా కృష్ణమోహన్ రెడ్డి ఉండేవారు. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఓఎస్డిగా ఆయనే కొనసాగారు. మొన్నటి మద్యం కుంభకోణంలో ఆయన పాత్ర కూడా బయటపడింది. భారీగా ఆయన సైతం వెనుకేసుకున్నట్లు స్పష్టమైంది. మరోవైపు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి కార్యాలయాధికారిగా ధనుంజయ రెడ్డి ఉండేవారు. జగన్మోహన్ రెడ్డికి ఇష్టమైన అధికారి కూడా.

Also Read:పసునూరు గ్రామ సభలో సీఐ దూది రాజు.

ఆయన సైతం మద్యం కుంభకోణంలో భారీగా సంపాదించినట్లు సిట్ విచారణలో తేలింది. ఇంకోవైపు జగన్మోహన్ రెడ్డికి అత్యంత వీర విధేయుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మద్యం కుంభకోణంలో భారీగా వెనుకేసుకున్నట్లు సిట్ తేల్చింది. అటు సజ్జల రామకృష్ణారెడ్డి పాత్ర పై కూడా అనేక రకాల ఆరోపణలు వచ్చాయి.

అయితే వీరంతా మద్యం కుంభకోణంలో భారీగా సంపాదించినట్లు స్పష్టం కావడంతో జగన్మోహన్ రెడ్డి పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. తన పేరు చెప్పుకొని కోర్ టీం ఇంత సంపాదించిందా? అని ఆశ్చర్యపోతున్నారట. అందుకే తన చుట్టూ ఉన్న బృందాన్ని.. తప్పించాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.

పాదయాత్ర నాటికి కొత్త టీం..
వచ్చే ఏడాది జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకు సిద్ధపడుతున్నారు. ఆ సమయానికి కొత్త టీం రంగంలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. వీరిని నమ్ముకుంటే మరోసారి ఇబ్బందికర పరిస్థితులు వస్తాయని జగన్మోహన్ రెడ్డికి తెలుసు. అందుకే ఈ కోర్ టీంలోకి ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వంటి నేతలను తీసుకోనున్నట్లు ప్రచారం నడుస్తోంది. మరి ఈ ప్రచారంలో ఎంత వాస్తవం ఉందో తెలియాలి.

Also Read:లోక్ సభ డిప్యూటీ స్పీకర్ గా పురందేశ్వరి…!

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు