Homeతెలంగాణగుండాల: తాటి చెట్టుపై నుంచి పడి గీత కార్మికుడి మృతి..!

గుండాల: తాటి చెట్టుపై నుంచి పడి గీత కార్మికుడి మృతి..!

  • శోకసముద్రంలో మునిగిన సుద్దాల గ్రామం..

గుండాల, జనవరి 27(క్రైమ్ మిర్రర్): యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల సుద్దాల గ్రామంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గీత కార్మికుడు యమగాని బక్కయ్య మంగళవారం జీవనోపాధి కోసం తాటిచెట్టుపైకి ఎక్కి కళ్లు తీస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు చెట్టు పై నుంచి కింద పడిపోయాడు.

ఈ ఘటనలో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి.సమాచారం అందుకున్న వెంటనే 108 అత్యవసర వైద్య సేవల సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని ప్రథమ చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం బక్కయ్యను జనగామ ఆస్పత్రికి తరలించారు.

అయితే ఆస్పత్రికి తరలిస్తున్న క్రమంలోనే ఆయన పరిస్థితి విషమించి దురదృష్టవశాత్తు మృతి చెందినట్లు సమాచారం.బక్కయ్య మృతి విషయం తెలియడంతో కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జనగామ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.రోజువారీ కష్టపడి పనిచేసే గీత కార్మికుడి అకాల మరణం గ్రామాన్ని శోకసంద్రంలో ముంచింది. మృతుడి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని, ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని గ్రామస

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

తాజావార్తలు