Homeఆంధ్ర ప్రదేశ్వైకాపా నాపై అక్ర‌మంగా కేసులు పెట్టింది

వైకాపా నాపై అక్ర‌మంగా కేసులు పెట్టింది

  • రాజధాని ప‌ర్య‌ట‌న‌లో మంత్రి నారాయణ

అమరావతి, క్రైమ్ మిర్ర‌ర్: వైకాపా హాయాంలో నాపై అక్ర‌మంగా కేసులు పెట్టింద‌ని మంత్రి నారాయ‌ణ అన్నారు. సోమ‌వారం ఆయ‌న నేల‌పాడులో నిర్మాణంలో ఉన్న గెజిటెడ్ అధికారుల టైప్‌-1, టైప్‌-2, గ్రూపు-డి ఉద్యోగుల క్వార్ట‌ర్ల‌ను ప‌రిశీలించారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడారు. ఇన్న‌ర్ రింగ్ రోడ్డులో అలైన్‌మెంట్‌లో 2001లో కొన్న 60 సెంట్ల త‌న సొంత స్థ‌లం కూడా పోయింద‌ని తెలిపారు.

కాగా నా స్థ‌లం గుండా ఇన్న‌ర్ రింగు రోడ్డు వెళ్తుంద‌ని, బిల్డింగ్ నిర్మాణం కోసం వెళితే సీఆర్‌డీఏ వాళ్లు మీ స్థ‌లం లేద‌ని చెప్పారు. ప్ర‌స్తుతం కోర్టులో కేసు న‌డుస్తుంది దీనిపై ఏమి మాట్లాడ‌లేన‌ని తెలిపారు. అమ‌రావ‌తితో భ‌వ‌నాల నిర్మాణాల ప‌నులు వేగంగా జ‌రుగుతున్నాయ‌ని తెలిపారు. 4026 ఇండ్ల‌కు అంత‌ర్గ‌త ప‌నులు న‌డుస్తున్నాయి.

గ‌త ప్ర‌భుత్వంలో ప‌నులు నిలిచిపోయి అనేక ఇబ్బందులు ఏర్ప‌డ్డాయి. కాగా వ‌ర్షాల వ‌ల్ల గ‌త న‌వంబ‌రు వ‌ర‌కు ప‌నులు జ‌రుగ‌లేదు. అమరావతిలో ప్రైవేట్ సంస్థలు నిర్మాణ పనులు కూడా చాలా వరకూ జరుగుతున్నాయ‌న్నారు.టార్గెట్ ప్రకారం పనులు చేయకపోవడంపై షాపూర్జీ – పల్లోంజి మేనేజ్మెంట్ తో మాట్లాడుతున్నానని వెల్లడించారు.

 

 

 

తాజావార్తలు