కర్ణాటకలోని మండ్య జిల్లాలో చోటుచేసుకున్న ఓ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. వివాహేతర సంబంధం నేపథ్యంలో తలెత్తిన కుటుంబ కలహాలు చివరకు ఇద్దరి ప్రాణాలను బలిగొన్నాయి. ఓ మహిళ తన పరిచయస్తుడైన ర్యాపిడో డ్రైవర్‌తో కలిసి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.
వివరాల్లోకి వెళితే.. మండ్య జిల్లాకు చెందిన సహనకు ఆటో డ్రైవర్ వీరేశ్‌తో వివాహమైంది. అయితే ఆమెకు ర్యాపిడో డ్రైవర్ రాహుల్‌తో పరిచయం ఏర్పడింది. కొంతకాలానికి వీరిద్దరి మధ్య సన్నిహిత సంబంధం ఏర్పడినట్లు సమాచారం. ఈ విషయం సహన భర్త వీరేశ్‌కు తెలియడంతో దంపతుల మధ్య తరచూ గొడవలు జరిగినట్లు తెలుస్తోంది.
ఈ పరిణామాలతో మనస్తాపానికి గురైన సహన, రాహుల్‌తో కలిసి తీవ్ర నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. శుక్రవారం తెల్లవారుజామున మండ్యలోని ఇండువాల్ సమీపంలో రైలు కింద పడి ఇద్దరూ ప్రాణాలు తీసుకున్నారు.
సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించి కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి.
also read: విషాదం!… అమెరికాలో తెలంగాణ యువకుడి అనుమానాస్పద మృతి..
