లక్నో,క్రైమ్‌మిర్రర్: అతివేగంతో కారు కరెంటు పోలును ఢీకొట్టిన ఘటనలో చిన్నారితో సహా ఆరుగురు సజీవదహనం అయిన సంఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది. కరెంటు పోల్‌ను ఢీకొట్టడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో చిన్నారితో సహా కారులో ఉన్న అందరూ కాలిపోయారు. ఈ విషాదకర సంఘటన ముజఫర్‌నగర్ జిల్లాలోని పానిపట్-ఖతిమా జాతీయ రహదారి జగహేరి సమీపంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సోమవారం ఉదయం అతివేగంగా వస్తున్న కారు రోడ్డు పక్కన ఉన్న వేగంగా దూసుకెళ్తున్న కారు అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని, డివైడర్‌ను బలంగా ఢీకొట్టి బోల్తా పడింది. ప్రమాదం జరిగిన వెంటనే కారులో భారీగా మంటలు చెలరేగాయి. తప్పించుకునే అవకాశం లేకపోవడంతో అందులో ప్రయాణిస్తున్న ఒక చిన్నారి సహా ఆరుగురు వ్యక్తులు కారులోనే చిక్కుకుపోయి సజీవదహనమయ్యారు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. కారులోని మృతదేహాలను వెలికితీసి పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వ దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.ప్రాథమిక సమాచారం ప్రకారం మృతులంతా హర్యానాలోని జింద్ లేదా హిసార్ జిల్లాకు చెందిన ఒకే కుటుంబ సభ్యులుగా పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. వీరంతా కారులో హర్యానా నుండి హరిద్వార్‌కు ప్రయాణిస్తుండగా ఈ విషాదం చోటుచేసుకుంది. మృతుల్లో 10 నుండి 12 సంవత్సరాల మధ్య వయస్సు గల ఒక బాలుడు కూడా ఉన్నాడని అధికారులు తెలిపారు.పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడ చదవండి:
- తల్లి మృతదేహం వద్దే రాత్రంతా రోదించిన మూడేళ్ల బాలుడు.. ఉరివేసుకుని మహిళ ఆత్మహత్య
-
ఏపీలో ఇక కాంగ్రెస్…!
-
బీహార్‌లో దారుణం.. యువతిని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అఘాయిత్యం!
-
ప్రేమ పేరుతో వేధింపులు.. ప్రపోజల్ తిరస్కరించిందని డిగ్రీ విద్యార్థినిపై లైంగిక దాడి!
