Homeక్రైమ్తల్లి మృతదేహం వద్దే రాత్రంతా రోదించిన మూడేళ్ల బాలుడు.. ఉరివేసుకుని మహిళ ఆత్మహత్య

తల్లి మృతదేహం వద్దే రాత్రంతా రోదించిన మూడేళ్ల బాలుడు.. ఉరివేసుకుని మహిళ ఆత్మహత్య

క్రైమ్ మిర్రర్ : కుటుంబ కలహాల నేపథ్యంలో తీవ్ర మనస్తాపానికి గురై ఒక మహిళ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న హృదయవిదారక ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటనలో తల్లి మృతదేహం వద్దే రాత్రంతా ఏడుస్తూ ఆకలితో, ఒంటరితనంతో ఆ చిన్నారి సొమ్మసిల్లిపోయిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది.
పోలీసులు, కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. ఆదోనికి చెందిన స్వాతికి, హైదరాబాద్‌కు చెందిన గణేశ్‌తో నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి మూడేళ్ల కుమారుడు శ్రీయాన్ ఉన్నాడు. కొంతకాలంగా భార్యాభర్తల మధ్య కుటుంబ కలహాలు తలెత్తడంతో.. స్వాతి తన భర్తకు ఏడాది కాలంగా దూరంగా ఉంటూ పుట్టింట్లో ఉంటోంది. చిన్నారి శ్రీయాన్ కూడా తల్లి వద్దే ఉంటున్నాడు.
ఈ క్రమంలోనే నిన్న సాయంత్రం స్వాతి తల్లి బంధువుల ఇంటికి వెళ్లారు. ఇంట్లో ఎవరు లేని సమయం చూసి స్వాతి తీవ్ర నిర్ణయం తీసుకుని బెడ్‌రూమ్‌లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఉదయం ఎంతకీ తలుపులు తీయకపోవడంతో అనుమానం వచ్చిన ఇరుగుపొరుగువారు పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లి చూడగా.. స్వాతి ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. ఆమె ఆత్మహత్యకు ఉపయోగించిన స్టూల్ పైనే చిన్నారి శ్రీయాన్ స్పృహ కోల్పోయి పడి ఉన్నాడు. మొదట బాలుడు కూడా ప్రాణాలు కోల్పోయి ఉంటాడని భయపడిన పోలీసులు, చిన్నారిని దగ్గరికి తీసుకుని గట్టిగా తట్టడంతో ఏడ్చాడు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
రాత్రంతా తల్లి కోసం ఏడుస్తూ, ఆ చిన్నారి ఆ టూల్ పైనే ఉండి స్పృహ కోల్పోయి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ఒంటరితనాన్ని భరించలేకే తన కుమార్తె ఈ అఘాయిత్యానికి పాల్పడిందని మృతురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు సంఘటనా స్థలంలో సాక్ష్యాధారాలు సేకరించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
also read : ఎమ్మిగనూరులో నకిలీ స్వామి గుట్టురట్టు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు