Homeతెలంగాణ'ధరణి' పేరుతో దందా...!

‘ధరణి’ పేరుతో దందా…!

  • తెలంగాణలో స్వీడ్ పెంచిన సిఐడి

  • గులాబీ పార్టీ అగ్ర నేతలపై గురి

  • భారీగా అక్రమాలు వెలుగులోకి..

క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో రాజకీయం మరోసారి వేడెక్కింది. గత గులాబీ ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన ధరణి భూముల డిజిటల్ పోర్టల్ లో జరిగిన అక్రమాలపై తెలంగాణ సిఐడి రంగంలోకి దిగింది. దీంతో ఒక్కసారిగా సీన్ మారింది. సిఐడితోపాటు ప్రత్యేక దర్యాప్తు బృందాలు సైతం రంగంలోకి దిగాయి. హైదరాబాద్ పరిసర ప్రాంతాలు, ఇతర జిల్లాల్లో రహస్య ఆపరేషన్లు నిర్వహిస్తున్నాయి. ధరణి ఆపరేటర్లు, అధికారులను వరుసగా కష్టానికి తీసుకోవడం సంచలనంగా మారుతోంది. నాటి ప్రభుత్వంలోని పెద్దల ఆదేశాల మేరకే సెక్షన్ 22 ఏ కింద ఉన్న నిషేధిత జాబితా భూములు, అసైన్డ్ మరియు విలువైన ప్రభుత్వ భూములను అక్రమంగా ప్రైవేటు వ్యక్తుల పేరిట బదిలీ చేశారని ప్రాథమిక ఆధారాలు లభించినట్లు తెలుస్తోంది. అందుకే విచారణ లో వేగం పెరిగినట్లు సమాచారం.

అనుమానాస్పద భూ లావాదేవీలు…

ధరణి పోర్టల్ లో అక్రమాలకు సంబంధించి.. ఫోరెన్సిక్ ఆడిట్లో పదివేలకు పైగా అనుమానాస్పద భూ లావాదేవీలు వెలుగు చూసాయి. ప్రధానంగా రంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్ జిల్లాలోని విలువైన భూముల హక్కుల మార్పిడి వెనుక ఎవరున్నారనే కోణంలో సిఐడి ప్రధానంగా దృష్టి సారించింది. సిరిసిల్ల, సిద్దిపేట ప్రాంతాల నుంచి ప్రారంభమైన విచారణ ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా విస్తరించింది. ఆపరేటర్ల డిజిటల్ కి లను ఉపయోగించి.. రాత్రి వేళల్లో జరిగిన లాగిన్ లను బయటకు తీస్తుండడంతో నాటి రెవెన్యూ యంత్రాంగం పై వల బిగుస్తోంది. కేవలం దిగువ స్థాయి సిబ్బంది లేదా ఆపరేటర్లనే కాకుండా.. ఈ భూముల దందాల వెనుక లబ్ధి పొందిన అసలైన పెద్దల పేర్లను సిఐడి బయటకు తీసేందుకు సిద్ధపడుతుండడం గులాబీ పార్టీ నేతల్లో ఆందోళన కలిగిస్తోంది.

బిగిస్తున్న ఉచ్చు…

దర్యాప్తు వేగవంతం అవుతున్న వెనుక భారీ రాజకీయ వ్యూహం ఉన్నట్టు అర్థమవుతోంది. ఈ విచారణ లక్ష్యం కేవలం అక్రమాలను వెలికి తీయడమే కాకుండా గులాబీ పార్టీ అగ్ర నేతలను నేరుగా టార్గెట్ చేయడమే నన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాలేశ్వరం, ఫోన్ టాపింగ్ వ్యవహారాలతో పాటు ధరణి అక్రమాలను కూడా గులాబీ పార్టీ అధినాయకత్వానికి చుట్టుముట్టించే వ్యూహంతోనే సిఐడిని రంగంలోకి దించారని విశ్లేషకులు భావిస్తున్నారు. గత ఐదు సంవత్సరాలుగా పవర్ సెంటర్ గా పనిచేసిన నాటి మున్సిపల్, రెవెన్యూ శాఖల ఉన్నతాధికారులు, కీలక నేతల పాత్ర పై ఈడీ లేదా సిఐడి కఠిన చర్యలు తీసుకునే దిశగా ఆధారాలు సేకరిస్తున్నట్లు ప్రచారం నడుస్తోంది. ప్రధానంగా గులాబీ పార్టీ అగ్ర నేతల పేర్లు బయటకు వస్తున్నాయి. సిఐడి విచారణలతో అక్రమాల గుట్టురట్టయితే గులాబీ పార్టీ అగ్రనేతలకు చట్టపరమైన చిక్కులు పంపకపోవచ్చు. చూడాలి చివరకు ఏం జరుగుతుందో..

ఇవి కూడ చ‌ద‌వండి:
  1.  భారత్ సమ్మిట్ కు సర్వం సిద్ధం…!
  2.  ఏపీలో ఇక కాంగ్రెస్…!
  3.  బీహార్‌లో దారుణం.. యువతిని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అఘాయిత్యం!
  4.  ప్రేమ పేరుతో వేధింపులు.. ప్రపోజల్ తిరస్కరించిందని డిగ్రీ విద్యార్థినిపై లైంగిక దాడి!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు