-
సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరు..
-
తరలిరానున్న మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, ఇతర సినీ ప్రముఖులు
క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో: విజయవాడ మేయర్ గా వంగవీటి రాధాకృష్ణ ఘనవిజయం సాధించారు. దాదాపు రెండు దశాబ్దాలకు పైగా పవర్ పాలిటిక్స్ కు దూరం అయ్యారు. రాజకీయంగా తప్పక అడుగులు వేయడంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎట్టకేలకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆయన విషయంలో ప్రత్యేక ఆలోచన చేశారు. అందుకే తెలుగుదేశం పార్టీ నుంచి జనసేనలోకి పంపించి పొత్తులో భాగంగా మేయర్ పదవి వచ్చేలా ప్రణాళిక వేశారు. ఆ ఇద్దరు నేతల నమ్మకం వమ్ము కాలేదు. భారీ మెజారిటీతో గెలిచారు వంగవీటి రాధాకృష్ణ. అందుకే రాధాకృష్ణ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏపీ సీఎం చంద్రబాబు తో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరు కానున్నట్లు ప్రచారం జరుగుతోంది. సినీ ప్రముఖులు మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ సైతం వేడుకకు హాజరవుతారని టాక్ నడుస్తోంది. సుదీర్ఘ విరామం తర్వాత వంగవీటి కుటుంబం నుంచి రాధాకృష్ణ పదవిని అలంకరిస్తుండడంతో రంగా రాధా మిత్రమండలి లో జోష్ నెలకొంది. సామాజిక వర్గాల ఈక్వేషన్ కూడా విజయవాడలో సక్సెస్ చేసింది కూటమి.
తండ్రికి తగ్గ తనయుడిగా…
వంగవీటి మోహన్ రంగ పేరు చెబితేనే విజయవాడ పులకించుకుపోతుంది. ఆయన కాపుల ఆరాధ్య దైవం. విజయవాడ కార్పొరేటర్ గా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు మోహన్ రంగా. అటు తరువాత తూర్పు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అయ్యారు. కానీ రాధాకృష్ణ మాత్రం 2004లో నేరుగా ఎమ్మెల్యేగా గెలిచి అతి చిన్న వయసులోనే అసెంబ్లీలో అడుగు పెట్టారు. అయితే మధ్యలో పార్టీలు మారడం.. ఎన్నెన్నో రాజకీయ అవమానాలను ఎదుర్కొన్నారు. ఎట్టకేలకు ఆయనకు మంచి గౌరవం దక్కింది. విజయవాడ మేయర్ గా ఛాన్స్ దక్కించుకున్నారు. రాజకీయాలకు చాలా దగ్గరగా ఉంటుంది విజయవాడ నగరం. అందుకే అట్టహాసంగా మేయర్ ప్రమాణస్వీకారం వేడుకలు జరపాలని నిర్ణయించారు. కార్యక్రమానికి ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మిగతా మంత్రులు సైతం హాజరయ్యే అవకాశం ఉంది.
సినీ పరిశ్రమతో సంబంధాలు…
వంగవీటి రాధాకృష్ణకు తెలుగు సినీ ప్రముఖులు కూడా మంచి సుపరిచితులు. పేరున్న కుటుంబం కావడంతో రాధాకృష్ణతో వ్యక్తిగత సంబంధాలు కూడా ఉన్నాయి. గతంలో ప్రజారాజ్యం పార్టీలో కూడా పనిచేశారు. చిరంజీవితో మంచి సంబంధాలు ఉన్నాయి. ఇప్పుడు జనసేనలో ఉండటంతో మరింత దగ్గరయ్యారు. ఆపై కూటమిలో కీలక భాగస్వామిగా ఉండడం.. రాజకీయ ప్రధాన కేంద్రం కావడంతో రాధాకృష్ణ ప్రమాణస్వీకారం వేడుకలకు నందమూరి బాలకృష్ణ కూడా వచ్చేందుకు సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. వీరే కాకుండా సినీ ప్రముఖుల్లో చాలామంది, రాజకీయ అతిరథ మహారధులు సైతం వేడుకలకు హాజరయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. చూడాలి మరి..
ఇవి కూడ చదవండి:
- తల్లి మృతదేహం వద్దే రాత్రంతా రోదించిన మూడేళ్ల బాలుడు.. ఉరివేసుకుని మహిళ ఆత్మహత్య
-
ఏపీలో ఇక కాంగ్రెస్…!
-
బీహార్లో దారుణం.. యువతిని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అఘాయిత్యం!
-
ప్రేమ పేరుతో వేధింపులు.. ప్రపోజల్ తిరస్కరించిందని డిగ్రీ విద్యార్థినిపై లైంగిక దాడి!
