-
చీరాల విజయంతో గట్టి ఆలోచనతో హస్తం
-
వైసీపీ సీనియర్ నేతలను ఆకర్షిస్తే ఎంతో ప్రయోజనం
-
పూర్వవైభవం ఖాయం అంటున్న విశ్లేషకులు
క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో: ఏపీలో కాంగ్రెస్ పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బలహీనం అవుతుండడంతో కాంగ్రెస్ క్రియాశీలకంగా మారే అవకాశం ఉంది. ఉమ్మడి ప్రకాశం జిల్లా చీరాలలో కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచింది. అక్కడ మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణప్రసాద్ రూపంలో బలమైన నాయకత్వం లభించడంతో.. కాంగ్రెస్ గట్టి ప్రదర్శన చేసింది. గౌరవప్రదమైన వార్డు స్థానాలను గెలుచుకుంది. పదివేలకు పైగా ఓట్లు సాధించింది. అందుకే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి నియోజకవర్గాల్లో సరైన నాయకత్వం లభిస్తే పూర్వ వైభవం సంతరించుకునే అవకాశం ఉంది. నిజంగా ఇది కాంగ్రెస్ పార్టీకి కనువిప్పు కలిగించే విషయం. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్లను కాంగ్రెస్లోకి రప్పించి యాక్టివ్ చేస్తే ఆ పార్టీకి పూర్వవైభవం ఖాయమని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు.
విభజన తర్వాత గల్లంతు…
రాష్ట్ర విభజన తర్వాత దశాబ్దానికి పైగా ఉనికి కోల్పోయింది కాంగ్రెస్ పార్టీ. ఏ ఎన్నికల్లో కూడా కనీస డిపాజిట్లను కూడా సాధించలేక చతికిల పడింది. ఇటువంటి సమయంలో చీరాల మున్సిపల్ ఫలితం కాంగ్రెస్ పార్టీలో కొత్త ఆశలను రేకెత్తిస్తోంది. 10 వార్డు స్థానాలతో అక్కడ ప్రధాన ప్రతిపక్షంగా నిలిచింది. అధికార పార్టీ తర్వాత రెండో స్థానంలో నిలవడం.. ఎనిమిది వార్డు స్థానాలకు మాత్రమే వైయస్సార్ కాంగ్రెస్ పరిమితం కావడంతో.. కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఒక రకమైన కొత్త ఆశలను రేకిత్తించేలా చేస్తోంది. ఒక్క చీరాలలో మాత్రమే కాదు.. రాష్ట్రవ్యాప్తంగా బలమైన నియోజకవర్గాల్లో బలమైన నేతలను రంగంలోకి దించితే.. కాంగ్రెస్ పార్టీకి గౌరవప్రదమైన ఓట్లు దక్కడం ఖాయం అని చీరాల ఫలితం తేల్చింది.
వారంతా కాంగ్రెస్ వారే…
ప్రస్తుతం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్ నేతలంతా ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నవారే. కాంగ్రెస్ లో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ. రాజశేఖర్ రెడ్డి రూపంలో కాంగ్రెస్ పార్టీకి బలమైన నాయకత్వం దొరికింది. అదే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా తన సొంత టీమును తయారు చేసుకున్నారు. ఎంతోమంది కొత్త నేతలను సైతం ప్రోత్సహించారు. ఆ అభిమానంతోనే జగన్మోహన్ రెడ్డి వెంట ఎక్కువమంది అడుగులు వేశారు. కానీ ఆయన నిర్ణయాలు పార్టీకి శాపంగా మారాయి. వరుస పరాజయాలతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రోజురోజుకు బలహీనమవుతోంది. అందుకే నేతల్లో చాలా నిరాశ ఎక్కువగా అలుముకుంది. అటువంటి వారిని ఆకర్షించి కాంగ్రెస్ పార్టీలోకి రప్పిస్తే.. ఆ పార్టీకి పూర్వ వైభవం రావడం ఖాయం. జాతీయస్థాయిలో పుంజుకునే ప్రయత్నాలు చేస్తున్న కాంగ్రెస్ ఏపీపై దృష్టి పెట్టి.. వైసిపి నేతలను ఆకర్షించి బాధ్యతలు కట్టబెడితే అద్భుత విజయాలు సొంతం చేసుకునే అవకాశం ఉంది. చూడాలి కాంగ్రెస్ అగ్రనాయకత్వం ఏం చేస్తుందో.
ఇవి కూడ చదవండి:
- తల్లి మృతదేహం వద్దే రాత్రంతా రోదించిన మూడేళ్ల బాలుడు.. ఉరివేసుకుని మహిళ ఆత్మహత్య
-
ఎమ్మిగనూరులో నకిలీ స్వామి గుట్టురట్టు
-
బీహార్లో దారుణం.. యువతిని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అఘాయిత్యం!
-
ప్రేమ పేరుతో వేధింపులు.. ప్రపోజల్ తిరస్కరించిందని డిగ్రీ విద్యార్థినిపై లైంగిక దాడి!
