హైదరాబాద్‌లో పండగ వేళ విషాదకర ఘటనలు చోటుచేసుకున్నాయి. నగరంలోని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందగా, మరోవైపు బాచుపల్లి ఫ్లైఓవర్‌పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇంజినీరింగ్ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. ఈ రెండు ఘటనలు స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపాయి.
గోపన్‌పల్లిలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి
గచ్చిబౌలి పరిధిలోని గోపన్‌పల్లిలో ఈ విషాద ఘటన వెలుగులోకి వచ్చింది. జయభేరి అపార్ట్‌మెంట్స్‌లో నివాసం ఉంటున్న బట్టుల మారెడ్డి (65), ఆయన భార్య భారతి (60), కుమారుడు నిశాంత్ రెడ్డి (38) తమ నివాసంలోనే ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆదివారం ఉదయం సుమారు 8 గంటల సమయంలో ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అపార్ట్‌మెంట్‌కు చేరుకుని పరిశీలించారు.
కుటుంబంలో నెలకొన్న కలహాలు, అనారోగ్య సమస్యలు ఈ ఘటనకు కారణమై ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. అయితే ఆత్మహత్యకు అసలు కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా జనరల్ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు.
బాచుపల్లి ఫ్లైఓవర్‌పై ప్రమాదం.. విద్యార్థి మృతి
మరోవైపు బాచుపల్లి ఫ్లైఓవర్‌పై జరిగిన రోడ్డు ప్రమాదం కూడా విషాదాన్ని మిగిల్చింది. బైక్‌పై ప్రయాణిస్తున్న సమయంలో వాహనం అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సూర్య అనే ఇంజినీరింగ్ విద్యార్థి తీవ్రంగా గాయపడి మృతి చెందాడు. బైక్ వెనుక కూర్చున్న యువతికి కూడా గాయాలయ్యాయి.
ఈ ఘటనలపై పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పండగ వేళ చోటుచేసుకున్న ఈ వరుస విషాద ఘటనలు స్థానికంగా కలకలం రేపాయి.
also read: దక్షిణాది సినిమా సెట్స్‌లో ఒంటరితనం.. మరోసారి రాధికా ఆప్టే సంచలన వ్యాఖ్యలు!
