ఆంధ్ర ప్రదేశ్క్రైమ్జాతీయంతెలంగాణ

సింగర్‌ కల్పన ఎందుకు ఆత్మహత్యాయత్నం చేసింది..? విచారణలో విస్తుపోయే వాస్తవాలు..!

కల్పన… ప్రముఖ సింగర్‌. తెలుగు సినీ పరిశ్రమలో మంచి పేరున్న సింగర్స్‌లో ఆమె ఒకరు. డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌ కూడా. ఈమె ఆత్మహత్యాయత్నం …  కలకలం రేపింది. అసలు కల్పన ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంది..? కుటుంబంలో గొడవలా…? భర్తతో పొసగడం లేదా..? లేక… అవకాశాలు లేవన్న డిప్రెషనా..? అది తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. నిన్న (మంగళవారం) సాయంత్రం నుంచి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది కల్పన. ఆమెకు ప్రాణాపాయం ఏమీ లేదని వైద్యులు తెలిపారు.

పోలీసుల విచారణలో కీలక విషయాలు బయటపడుతున్నాయి. కల్పన భర్తను కూడా పోలీసులు ప్రశ్నించారు. కల్పన.. 2010లో మొదటి భర్తకు విడాకులు ఇచ్చి.. రెండో పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం రెండో భర్తతో కలిసి… హైదరాబాద్‌ నిజాంపేటలోని వర్టెక్స్‌ ప్రివిలేజ్‌ విల్లాస్‌లో ఉంటోంది. ఆమెకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. రెండు రోజులుగా ఇంట్లోనే ఉంటోంది కల్పన. ఎన్ని సార్లు ఫోన్‌ చేసినా తీయకపోవడంతో అనుమానించిన సెక్యూరిటీ సిబ్బంది.. ఆమె భర్తకు ఫోన్‌ చేశారు. ఆమె భర్త ఫోన్‌ చేసినా కల్పన స్పందించలేదు. దీంతో. KPHB పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి.. తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లారు. లోపల.. బెడ్‌పై అపస్మాకరస్థితిలో పడి ఉంది కల్పన. వెంటనే ఆమెను … ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేరించారు. విషయం తెలిసి భర్త కూడా హైదరాబాద్‌ ఇచ్చారు. ఆయన్ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు పోలీసులు. కల్పన ఉంటున్న ఇంటికి తీసుకెళ్లారు. తమ మధ్య విభేదాలు ఏమీ లేవని చెప్పారు కల్పన భర్త అంటున్నారు. మానసిక ఒత్తిడి వల్లే ఆత్మహత్యాయత్నం చేసుకుని ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

ప్రస్తుతం.. కల్పనకు ప్రాణాపాయం ఏమీ లేదని డాక్టర్లు తెలిపారు. ఆమె స్పృహలోకి వచ్చారని… వెంటిలేటర్‌ కూడా తీసేశామని హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేశారు. కల్పన స్టేట్‌మెంట్‌ కూడా రికార్డ్‌ చేయబోతున్నారు. కల్పన ఇచ్చే స్టేట్‌మెంట్‌ కీలకంగా మారనుంది. ఆమె ఎందుకు ఆత్మహత్య చేసుకుందో… తెలియాల్సి ఉంది. కల్పన కూతురు కేరళలో ఉంటోంది. విషయం తెలిసి హైదరాబాద్‌ ఇచ్చింది. కల్పన.. కొంతకాలంగా డిప్రెషన్‌లో ఉందని కుటుంబసభ్యులు చెప్తున్నారు.

జీవితంలో ఎన్నో కష్టాలు చూశానని… ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నానని .. పలు ఇంటర్వ్యూలలో చెప్పారు కల్పన. మొదటి భర్తతో విడాకులయ్యాక… ఎన్నో ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొన్నానని చెప్పింది కల్పన. పిల్లల పోషణ.. వారి చదువులు తనపైనే పడటంతో… ఆ పరిస్థితి ఎదుర్కొనేందుకు కష్టపడ్డానని భావోద్వేగానికి కూడా గురయ్యారు ఆమె. ఆ సమయంలో ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నానని కూడా చెప్పింది. కానీ… పాపులర్‌ సింగర్‌ చిత్ర ఆమెకు అండగా నిలిచారట. ధైర్యం చెప్పారట. ఆ తర్వాత పాటల పోటీలో పాల్గొని గెలిచి.. తనను తాను నిరూపించుకున్నానని ఇంటర్వ్యూలలో చెప్పింది కల్పన.

ఇప్పుడు.. కల్పన ఆత్మహత్యాయత్నానికి కారణం ఏంటి…? ఆమె కుటుంబంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి…? కల్పన ఎందుకు డిప్రెషన్‌లో ఉంది..? భర్త వైపు నుంచి సమస్యలు ఉన్నాయా..? లేక ఆర్థిక ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా…? వీటిపై పోలీసులు కూపీ లాగుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button