Homeఆంధ్ర ప్రదేశ్మీ పెట్టుబడులకు మాదే భరోసా.. ఏపీకి తరలిరండి: సింగపూర్ సదస్సులో సీఎం చంద్రబాబు పిలుపు!

మీ పెట్టుబడులకు మాదే భరోసా.. ఏపీకి తరలిరండి: సింగపూర్ సదస్సులో సీఎం చంద్రబాబు పిలుపు!

క్రైమ్ మిర్రర్,అమరావతి:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి అనుకూలమైన వాతావరణం ఉందని, ఇన్వెస్టర్ల పెట్టుబడులకు ప్రభుత్వం పూర్తి భరోసా ఇస్తుందని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. సింగపూర్‌లో జరిగిన ప్రతిష్టాత్మక ‘సీఐఐ (CII) సదస్సు’లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏపీలో ఉన్న సువర్ణ అవకాశాలను పారిశ్రామికవేత్తలకు వివరిస్తూ రాష్ట్రానికి రావాల్సిందిగా ఆహ్వానించారు.అమరావతిలో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో అంతర్జాతీయ ప్రమాణాలతో ‘ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్’ను ఏర్పాటు చేసినట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. ఈ డిస్ట్రిక్ట్‌లో ప్రముఖ అంతర్జాతీయ బ్యాంకులు, పెద్ద ఆర్థిక సంస్థలు కొలువుదీరనున్నాయని తెలిపారు.

“ఆంధ్రప్రదేశ్‌కు రండి.. మీ పెట్టుబడులకు ఇక్కడ ఢోకా లేదు, అవి అత్యంత సురక్షితంగా ఉంటాయి” అని ఇన్వెస్టర్లకు సీఎం చంద్రబాబు భరోసా ఇచ్చారు.స్టార్టప్‌లపై పెరుగుతున్న ఆసక్తిప్రస్తుత కాలంలో ధనవంతులు, పెద్ద కంపెనీలు స్టార్టప్‌లలో పెట్టుబడులు పెట్టడాన్ని ఒక అత్యంత విజయవంతమైన మార్గంగా భావిస్తున్నారని సీఎం అభిప్రాయపడ్డారు. నూతన ఆవిష్కరణలకు, స్టార్టప్ సాంస్కృతికి ఆంధ్రప్రదేశ్ వేదిక కాబోతోందని ఆయన పేర్కొన్నారు.డిసెంబర్ నాటికి ‘క్వాంటం కంప్యూటర్’ అందుబాటులోకి..రాష్ట్రంలో సాంకేతిక విప్లవానికి నాంది పలుకుతూ అమరావతిలో అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్టు రూపుదిద్దుకుంటోందని సీఎం వెల్లడించారు. ప్రముఖ దిగ్గజ ఐటీ, నిర్మాణ సంస్థలైన ఐబీఎం (IBM), టీసీఎస్ (TCS), ఎల్ అండ్ టీ (L&T) సంయుక్తంగా అమరావతిలో 133 క్యూబిట్ క్వాంటం కంప్యూటర్ను నెలకొల్పుతున్నాయని తెలిపారు. ఈ అత్యాధునిక క్వాంటం కంప్యూటర్ రాబోయే డిసెంబర్ (DEC) నుండి తన పనిని ప్రారంభించనుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సగర్వంగా ప్రకటించారు.ఈ సదస్సులో సింగపూర్ పారిశ్రామికవేత్తలు, అంతర్జాతీయ ప్రతినిధులు సీఎం చంద్రబాబు నాయుడు ప్రసంగానికి విశేషంగా స్పందించారు. ఏపీలో పెట్టుబడులకు పలు కంపెనీలు ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలుస్తోంది.

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు