Homeఆంధ్ర ప్రదేశ్గాయ‌ప‌డిన విద్యార్థిని త‌ల్లికి సీఎం చంద్ర‌బాబు ఫోన్‌...! అన్ని విధాలుగా అండ‌గా ఉంటామ‌ని భ‌రోసా...

గాయ‌ప‌డిన విద్యార్థిని త‌ల్లికి సీఎం చంద్ర‌బాబు ఫోన్‌…! అన్ని విధాలుగా అండ‌గా ఉంటామ‌ని భ‌రోసా…

అనంత‌పురం, క్రైమ్‌మిర్ర‌ర్‌: అనంత‌పురం జిల్లా రాప్తాడ్ జ‌డ్పీ స్కూల్‌లో ఉన్మాది దాడిలో తీవ్రంగా గాయ‌ప‌డి ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థిని త‌ల్లితో సీఎం చంద్ర‌బాబు ఫోన్‌లో మా్ట్లాడారు. ఉన్మాది దాడిలో తీవ్రంగా గాయపడిన విద్యార్థిని ప్రస్తుతం అనంతపురం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ క్రమంలో బాధిత విద్యార్థిని తల్లితో సీఎం ఫోన్‌లో మాట్లాడి ధైర్యం చెప్పారు. ధైర్యంగా ఉండాలని, నిందితుడిని పట్టుకుని కఠినంగా శిక్షిస్తామన్నారు.

విద్యార్థినిని కాపాడుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేద్దామని.. ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. విద్యార్థినికి అందుతున్న వైద్య సాయంపై స్థానిక ఎమ్మెల్యే పరిటాల సునీతతోనూ ముఖ్యమంత్రి మాట్లాడారు. ఉన్మాది దాడిలో గాయపడిన మరో విద్యార్థిని ఆరోగ్య పరిస్థితి గురించి కూడా అడిగి తెలుసుకున్నారు. ఇరువురు విద్యార్థినిలకూ మెరుగైన వైద్య చికిత్స అందించాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు.

ఇవి కూడ చ‌ద‌వండి:
  1.  వైసీపీకి షాక్…! టీడీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే అప్ప‌ల‌నాయుడు…
  2. రోహిత్ శర్మ జెర్సీ నెంబర్ 45 వెనుక ఉన్న అసలు కథ: అమ్మ సూచనే కారణం!
  3. కేటీఆర్ కరువు అస్త్రం…!
  4. శబరిమల భక్తులకు అదిరిపోయే గుడ్ న్యూస్..!

 

 

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు