Homeవైరల్సీఎం విజయ్ పుట్టినరోజున సేవా స్పూర్తి.. క్యాన్సర్ బాధితుల కోసం జుట్టు దానం చేసిన ఫోటోగ్రాఫర్

సీఎం విజయ్ పుట్టినరోజున సేవా స్పూర్తి.. క్యాన్సర్ బాధితుల కోసం జుట్టు దానం చేసిన ఫోటోగ్రాఫర్

తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ జన్మదినాన్ని ఓ వ్యక్తి ఎంతో అర్థవంతంగా జరుపుకున్నారు. తంజావూరుకు చెందిన ఫోటోగ్రాఫర్ కోట్టై దయా సమాజానికి ఉపయోగపడే విధంగా వినూత్న నిర్ణయం తీసుకుని అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. క్యాన్సర్ బాధితులకు విగ్‌లు తయారు చేయడానికి అవసరమైన జుట్టును దానం చేయాలనే ఉద్దేశంతో, ఆయన రెండేళ్లుగా పెంచుకున్న తన జుట్టును పూర్తిగా గుండు చేయించుకుని సమర్పించారు.

ఈ సందర్భంగా కోట్టై దయా మాట్లాడుతూ, ప్రముఖుల పుట్టినరోజులను కేవలం సంబరాలకే పరిమితం చేయకుండా, సమాజానికి మేలు చేసే పనులతో గుర్తుంచుకోవాలనే ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకున్నానన్నారు. తన చిన్న ప్రయత్నం వల్ల క్యాన్సర్‌తో బాధపడుతున్న వారికి కొంత ధైర్యం, ఆత్మవిశ్వాసం కలిగితే అదే తనకు గొప్ప సంతోషమని చెప్పారు. స్థానికంగా ఆయన చేసిన ఈ సేవా కార్యక్రమం విశేషంగా ప్రశంసలు అందుకుంటోంది. సోషల్ మీడియాలో కూడా ఈ ఘటనపై నెటిజన్లు స్పందిస్తూ, కోట్టై దయా చర్యను అభినందిస్తున్నారు. ఇటువంటి కార్యక్రమాలు సమాజంలో సేవా భావాన్ని పెంచుతాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.

కాగా, క్యాన్సర్ చికిత్సలో భాగంగా చాలా మంది రోగులు కీమోథెరపీ కారణంగా జుట్టు కోల్పోతారు. అటువంటి వారికి సహాయం చేయడానికి విగ్‌ల తయారీలో సహజ జుట్టు ఎంతో ఉపయోగపడుతుంది. చాలా సంస్థలు స్వచ్ఛందంగా జుట్టు దానం స్వీకరిస్తూ, అవసరమైన వారికి ఉచితంగా లేదా తక్కువ ధరకు విగ్‌లు అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కోట్టై దయా చేసిన పని మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.

also read: TG రైతు భరోసా పథకంలో మార్పులు? కొత్త నిబంధనలతో రేవంత్ సర్కార్ బిగ్ ట్విస్ట్! 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు