Homeవైరల్మరొకరి ఇయర్ బడ్స్ వాడుతున్నారా? పొంచి ఉన్న ముప్పుపై వైద్యుల తీవ్ర హెచ్చరిక!

మరొకరి ఇయర్ బడ్స్ వాడుతున్నారా? పొంచి ఉన్న ముప్పుపై వైద్యుల తీవ్ర హెచ్చరిక!

క్రైమ్ మిర్రర్, వైరల్ న్యూస్ :- స్మార్ట్‌ఫోన్‌ల వినియోగం పెరిగిన ఈ రోజుల్లో బ్లూటూత్ ఇయర్‌ఫోన్స్, ఇయర్‌బడ్స్ వాడకం ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భాగమైపోయింది. అయితే, స్నేహితులు లేదా సహోద్యోగులతో వీటిని పంచుకోవడం చాలా ప్రమాదకరమని వైద్య నిపుణులు తీవ్రంగా హెచ్చరిస్తున్నారు. ఇతరుల ఇయర్‌ఫోన్స్ వాడటం అంటే మనంతట మనం ఇన్ఫెక్షన్లను కొనితెచ్చుకోవడమేనని వారు స్పష్టం చేస్తున్నారు.ఇతరులు వాడిన ఇయర్‌బడ్స్ పెట్టుకోవడం అనేది.. చెమట పట్టిన సాక్సులు వేసుకోవడం కంటే అత్యంత అసహ్యకరమైన, అపరిశుభ్రమైన అలవాటు అని వైద్యులు అభివర్ణిస్తున్నారు.ప్రమాదం ఎలా పొంచి ఉందంటే..సాధారణంగా మనుషుల చెవిలో సహజంగానే కొంత బ్యాక్టీరియా ఉంటుంది. మనం ఇతరుల ఇయర్‌బడ్స్ వాడినప్పుడు.. వారి చెవిలోని బ్యాక్టీరియా మరియు ఫంగస్ చాలా సులభంగా ఈ పరికరాల ద్వారా మన చెవిలోకి ప్రవేశిస్తాయి. దీనివల్ల అనేక రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.దీని కారణంగా ప్రధానంగా:చెవిలో తీవ్రమైన దురదభరించలేని చెవి నొప్పిఇన్ఫెక్షన్లు తీవ్రమైతే శాశ్వత వినికిడి సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.వైద్యుల సూచన:ఈ ప్రమాదకరమైన ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా ఉండాలంటే.. మీ వ్యక్తిగత ఇయర్‌బడ్స్‌ను ఎవరికీ ఇవ్వకండి, అలాగే ఇతరుల ఇయర్‌బడ్స్‌ను మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ వాడకండి. వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం ద్వారా మాత్రమే చెవి సమస్యలను దూరం చేసుకోవచ్చని వైద్యులు ఖచ్చితంగా సూచిస్తున్నారు.

రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌కు అనిల్ రావిపూడి ఫన్నీ టచ్.. రక్తంతో వీర తిలకం వీడియో వైరల్!

‘రౌడీ’ అనే పదం పవన్ కళ్యాణ్‌కే వర్తిస్తుంది: వైఎస్సార్సీపీ నేత బొత్స సత్యనారాయణ

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

తాజావార్తలు