Homeఆంధ్ర ప్రదేశ్'రౌడీ' అనే పదం పవన్ కళ్యాణ్‌కే వర్తిస్తుంది: వైఎస్సార్సీపీ నేత బొత్స సత్యనారాయణ

‘రౌడీ’ అనే పదం పవన్ కళ్యాణ్‌కే వర్తిస్తుంది: వైఎస్సార్సీపీ నేత బొత్స సత్యనారాయణ

క్రైమ్ మిర్రర్,అమరావతి:- ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌పై వైఎస్సార్సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అధికారంలో ఉన్నవారు చాలా జాగ్రత్తగా, బాధ్యతాయుతంగా మాట్లాడాలని ఆయన హితవు పలికారు. ఇటీవల జరిగిన కాపు నేతల సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పవన్ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు.”ఆయన ఏమనుకుంటున్నారు? మేమంతా రౌడీలమా? నిజానికి ‘రౌడీ’ అనే పదం పవన్ కళ్యాణ్‌కే సరిగ్గా వర్తిస్తుంది. కేవలం నోరు ఉంది కదా అని ఇష్టానుసారం మాట్లాడటం ఏమాత్రం తగదు,” అని బొత్స మండిపడ్డారు.శాంతిభద్రతలు, నేరస్తుల పట్ల పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై బొత్స అభ్యంతరం వ్యక్తం చేశారు. “ఒక వ్యక్తి క్రిమినల్ అయితే పోలీసులు తీసుకెళ్లి చంపేస్తారా? అలా చంపేయాలని రాజ్యాంగంలో ఎక్కడైనా రాశారా? ఇలాంటి బాధ్యతారహితమైన, చట్టవ్యతిరేకమైన మాటలు మాట్లాడే వ్యక్తి అసలు ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండేందుకు అర్హుడేనా?” అని ఆయన సూటిగా ప్రశ్నించారు.

బిడ్డే నా ప్రపంచం అవుతుంది: వైరల్ అవుతున్న సమంత పాత కామెంట్స్

మా నాన్నే నా దేవుడు.. ఫాదర్స్ డే సందర్భంగా అల్లు అర్జున్ భావోద్వేగ పోస్ట్ వైరల్!!

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

తాజావార్తలు