క్రైమ్ మిర్రర్, సినిమా:- ప్రముఖ స్టార్ హీరోయిన్ సమంత త్వరలో తల్లి కాబోతున్నారంటూ ఇటీవల సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పిల్లలను కనడం, పెంచడంపై ఆమె గతంలో చేసిన కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట తీవ్ర వైరల్‌గా మారాయి.తన చిన్ననాటి కష్టాలను గుర్తుచేసుకున్న సమంత, భవిష్యత్తులో తన పిల్లలకు ఎలాంటి జీవితం ఇవ్వాలనుకుంటున్నారో ఆ ఇంటర్వ్యూలో స్పష్టంగా చెప్పారు. “నా బాల్యంలో నేను ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాను. నాలాంటి కష్టాలు పడిన వారు ఎవరైనా సరే.. తమ పిల్లలకు ఎలాంటి లోటు లేకుండా, ఎంతో సౌకర్యవంతమైన జీవితాన్ని అందించాలనుకుంటారు. నేను కూడా కచ్చితంగా అలాగే చేస్తాను,” అని ఆమె పేర్కొన్నారు.అంతేకాకుండా, తల్లి అయ్యాక తన ప్రాధాన్యతలు ఎలా ఉంటాయో కూడా ఆమె వివరించారు. “నాకు బిడ్డ పుట్టాక కనీసం కొన్నేళ్ల పాటు తనను వదిలి ఎక్కడికీ వెళ్లను. నా పూర్తి సమయం బిడ్డకే కేటాయిస్తాను, చాలా బాగా చూసుకుంటాను. అప్పుడు ఆ బిడ్డే నా లోకం అవుతుంది. అలాగే వర్కింగ్ మదర్స్ (ఉద్యోగం చేస్తూ పిల్లల్ని పెంచే తల్లులు) అంటే నాకు మాటల్లో చెప్పలేనంత గౌరవం,” అని సమంత వెల్లడించారు.తాజాగా ఆమె ప్రెగ్నెన్సీ రూమర్స్ వార్తల్లో నిలవడంతో, మాతృత్వంపై ఆమెకు ఉన్న ఈ స్పష్టమైన అభిప్రాయాలు నెటిజన్లను విశేషంగా ఆకర్షిస్తున్నాయి.
ఓజీ 2 కు శ్రీకారం.. పవన్ ఫ్యాన్స్‌కు మేకర్స్ క్రేజీ అప్‌డేట్!
టాప్ 5 రిచెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్లు.. సంగీతంతోనే కోట్ల సామ్రాజ్యం!