Homeఅంతర్జాతీయంఖ‌ర్గ్ ఐలాండ్‌పై అమెరికా మెరుపు దాడులు

ఖ‌ర్గ్ ఐలాండ్‌పై అమెరికా మెరుపు దాడులు

టెహ్రాన్‌, క్రైమ్ మిర్ర‌ర్: మ‌ధ్య ప్రాచ్యంలో యుద్దం రోజు రోజుకు భీక‌రంగా మారుతుంది. దీంతో అమాయ‌క ప్ర‌జ‌ల‌తో పాటు సైనికులు వేలల్లో మృత్యువాత ప‌డుతున్నారు. చివ‌రికి యుద్దం ఏ వైపు వెళ్తుందోన‌ని ప్ర‌జ‌లు ఆందోళ‌న చెందుతున్నారు. యుద్దం కార‌ణంగా నిత్యావ‌స‌ర స‌రుకుల‌తో చ‌మురు ధ‌ర‌లు పెరిగిపోతున్నాయి. దీంతో హోట‌ళ్లు తోపాటు గ్యాస్ అధారిత కంపెనీల‌న్ని మూసి వేసుకోవాల్సిన ప‌రిస్థితులు నెలకొన్నాయి.

తాజాగా అమెరికా ఇరాన్‌కు చమురుకు వ్యూహాత్మక హబ్‌గా ఉన్న ఖర్గ్ ఐలాండ్‌పై అమెరికా సెంట్రల్ కమాండ్ అత్యంత శక్తివంతమైన దాడులు జరిపినట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ట్రూత్ సోషల్ వేదికగా ప్రకటించారు. తన ఆదేశాలతో జరిగిన ఈ దాడిలో ఐలాండ్‌లోని సైనిక కేంద్రాలు ద్వంస‌మైన‌ట్లు తెలిపారు. ఇందుకు సంబంధించిన ‘బ్లాక్ అండ్ వైట్’ వీడియోను ఆయన విడుదల చేశారు.

అయితే దీనిపై ఎలాంటి క్యాప్షన్ లేదు. ప‌శ్చిమ ఆసియా చ‌రిత్ర‌లోనే అత్యంత శ‌క్తివంత‌మైన దాడులు చేశామ‌ని తెలిపారు. చ‌మురు, వ్యాపార నౌక‌ల‌కు హ‌ర్మూజ్ జ‌ల‌సంధిని మూసివేస్తే పెద్ద మొత్తంలో దాడులు చేస్తామ‌ని ఇరాన్‌ను హెచ్చ‌రించారు. నౌక‌ల‌కు ఎలాంటి ప్ర‌మాదాలు త‌ల‌పెట్టిన ఖర్గ్ ద్వీపంలోని చమురు మౌలిక సదుపాయాలను టార్గెట్ చేస్తామ‌ని తెలిపారు. ఇరాన్ ఖ‌ర్గ్ ద్వీపం నుంచే 90శాతం చ‌మురు స‌ర‌ఫ‌రా చేస్తోంది.

తాజావార్తలు