Homeలైఫ్ స్టైల్ఎముకలు బలంగా ఉండాలంటే.. ఈ ఆహారం తప్పనిసరి!

ఎముకలు బలంగా ఉండాలంటే.. ఈ ఆహారం తప్పనిసరి!

క్రైమ్ మిర్రర్, హెల్త్:- వయసు పెరుగుతున్న కొద్దీ ఎముకలు బలహీనపడటం సహజం. అయితే, సరైన పోషకాహారం తీసుకోవడం ద్వారా ఈ సమస్యను అరికట్టవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఎముకల దృఢత్వానికి ముఖ్యంగా కాల్షియం, విటమిన్ డి, మరియు ప్రొటీన్లు అత్యవసరం.ఎముకలు దృఢంగా ఉండటానికి నిపుణులు సిఫార్సు చేస్తున్న ఆహార పదార్థాలు ఇవే. పాలు, జున్ను, పెరుగులో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. తోటకూర, పాలకూర వంటి ఆకుకూరలు ఎముకల ఆరోగ్యానికి మేలు చేస్తాయి.గుడ్లు లో విటమిన్ డి, ప్రొటీన్లు అధికంగా ఉంటాయి. చియా గింజలు, సోయా బీన్స్ కూడా ఎముకల బలానికి సహాయపడతాయి. ఎండిన అంజీర్, ఆఫ్రికాట్ వంటివి డైట్‌లో చేర్చుకోవాలి. సార్డిన్స్, సాల్మన్ వంటి చేపల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ డి ఉంటాయి.

వ్యాయామం కూడా ముఖ్యమే.. కేవలం ఆహారం మాత్రమే కాకుండా, బరువు మోసే (వెయిట్ బేరింగ్) వ్యాయామాలు చేయడం వల్ల కూడా ఎముకలు దృఢంగా తయారవుతాయని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. రెగ్యులర్ గా వ్యాయామం చేయడం వల్ల ఎముకల సాంద్రత పెరుగుతుంది.

అకౌంట్లోకి రూ.13వేలు.. ‘తల్లికి వందనం’ దరఖాస్తులకు ఆగస్టు 3 వరకు అవకాశం!

చంద్రగిరిలో విషాదం.. వ్యక్తి ఆత్మహత్య- పోలీసుల వేధింపులే కారణమంటూ కుటుంబ సభ్యుల నిరసన

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

తాజావార్తలు