క్రైమ్ మిర్రర్, అంతర్జాతీయ న్యూస్:-
ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. లెబనాన్ పై దాడులు చేస్తున్న వ్యవహారాన్ని దృష్టిలో పెట్టుకొని ట్రంప్ ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు. ఒకరకంగా ట్రంప్ ఇజ్రాయిల్ ప్రధానికి సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్లు చెబుతున్నారు. తాను లేకపోతే నువ్వు జైల్లో ఉండేవాడివి అంటూ ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహూను ఉద్దేశించి ట్రంప్ వ్యాఖ్యలు చేసినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెలువరించాయి. ప్రస్తుతం అంతర్జాతీయ మీడియా కథనాలు ప్రపంచ వ్యాప్తంగా సంచలనాన్ని సృష్టిస్తున్నాయి. లెబనాన్ లో ఇజ్రాయిల్ చేపట్టిన తాజా సైనిక చర్యలు నేపథ్యంలో ఇద్దరు నేతల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరినట్లు తెలుస్తోంది. ఇద్దరి మధ్య చర్చల నేపథ్యంలో ట్రంప్ ఇజ్రాయిల్ ప్రధానిని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేసినట్లు చెబుతున్నారు. సైనిక చర్యను ఉద్దేశించి
నెతన్యాహూపై ట్రంప్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్లు మీడియా కథనాలు వుటంకించాయి. తాజాగా ఇజ్రాయిల్ చేపట్టిన సైనిక చర్యలు నేపథ్యంలో ఇజ్రాయిల్ ప్రధానితో ట్రంప్ ఫోన్లో మాట్లాడినట్లు సమాచారం. ఈ సందర్భంగానే ట్రంప్ నెతన్యాహూను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేసినట్లు చెబుతున్నారు. నువ్వు పిచ్చివాడివని, తాను లేకపోతే జైలులో ఉండేవాడు అంటూ ట్రంప్ వ్యాఖ్యానించినట్లు చెబుతున్నారు. తాను నిన్ను కాపాడుతున్నానని, ప్రస్తుతం నిన్ను అంత ద్వేషిస్తున్నారంటూ ఈ సందర్భంగా ట్రంప్ నెతన్యాహూతో ఫోన్లో ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్లు ఆ కథనాల్లో అంతర్జాతీయ మీడియా పేర్కొన్నాయి. నీ చర్యల వల్ల ఇజ్రాయిల్ పై కూడా వ్యతిరేకత పెరుగుతోందని, అసలు నువ్వు ఏం చేస్తున్నావ్ అంటూ ట్రంప్ ప్రశ్నించినట్లు ఆ వార్త కథనాల్లో మీడియా సంస్థలు పేర్కొన్నాయి. హిజ్బులాకు చెందిన ఒక సైనిక కమాండర్ ను హతమార్చేందుకు ఇజ్రాయిల్ సాగిస్తున్న దాడుల్లో అమాయకులైన లేబనాన్ పౌరులు ప్రాణాలు కోల్పోవడం పై ట్రంప్ ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
ఆ ప్రాంతాలను ఖాళీ చేయాలని ఇజ్రాయిల్ హెచ్చరిక..
ఇదెలా ఉంటే మరోవైపు బీరప్ప దక్షిణ శివారు ప్రాంతాలను ఖాళీ చేయాలని అక్కడ ప్రజలను ఇటీవల ఇజ్రాయిల్ హెచ్చరించింది. లేబనాన్ పై దాడులు చేస్తే శాంతి చర్చల నుంచి వాయిదాలుకుతామని ఇరాన్ బెదిరించిన నేపథ్యంలో.. ట్రంప్ ఇజ్రాయిల్ ప్రధానిపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఇరాన్ హెచ్చరికల నేపథ్యంలో నెతన్యాహూతో ఫోన్లో మాట్లాడిన ట్రంప్ ఈ మేరకు హెచ్చరికలు జారీ చేశారు. ఆ తరువాత హిజ్బుల్లా నాయకులతోను ట్రంప్ మాట్లాడినట్లు చెబుతున్నారు. ఇరు వర్గాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందని తన సోషల్ మీడియా ఖాతా ట్రూత్ ద్వారా ట్రంప్ తాజాగా వెల్లడించారు. ఇజ్రాయిల్ ప్రధానిపై ట్రంపు తాజాగా చేసిన వ్యాఖ్యల వ్యవహారం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇరుదేశాలు సంయుక్తంగా ఇరాన్ పై దాడులు సాగిస్తున్న నేపథ్యంలో తాజాగా వీరి మధ్య నెలకొన్న విభేదాలు ఎటువైపు దారితీస్తాయో అన్న ఆసక్తి ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో నెలకొంది.