Homeఅంతర్జాతీయంThreat To PM Modi: మోడీ వస్తే చావడం పక్కా, భారత ప్రధానికి హత్యా బెదిరింపులు!

Threat To PM Modi: మోడీ వస్తే చావడం పక్కా, భారత ప్రధానికి హత్యా బెదిరింపులు!

భారత ప్రధాని నరేంద్రమోడీ త్వరలో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనున్న నేపథ్యంలో సోషల్ మీడియాలో ఆయనకు బెదిరింపు సందేశం రావడం కలకలం రేపింది. ఈ ఘటనపై ఆస్ట్రేలియా భద్రతా సంస్థలు వెంటనే అప్రమత్తమై దర్యాప్తు ప్రారంభించాయి. ప్రధాని మోదీ జులై 8 నుంచి 10 వరకు ఆస్ట్రేలియాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా జులై 9న మెల్‌బోర్న్‌ లో నిర్వహించే ‘మెల్బోర్న్ మీట్స్ మోడీ’ కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉంది. ఈ ఈవెంట్‌కు సంబంధించిన పోస్టుకు ఫేస్‌ బుక్‌ లో ఒక వ్యక్తి అభ్యంతరకర వ్యాఖ్య చేశాడు. “స్టేడియం పైకప్పును మూసేయండి.. మోడీ ఈ కార్యక్రమానికి వస్తే అది మరణం వైపు వెళ్లినట్టే” అనే అర్థంలో బెదిరింపు కామెంట్ పోస్టు చేశారు.

ఈ కామెంట్  అబూ ముస్తాఫా అనే పేరుతో ఉన్న సోషల్ మీడియా ఖాతా నుంచి వచ్చినట్లు గుర్తించారు. విషయం తెలుసుకున్న వెంటనే ఆస్ట్రేలియా ఫెడరల్ పోలీసులు విచారణ ప్రారంభించారు. ఈ పోస్టు ఏ ఐపీ అడ్రస్ నుంచి వచ్చిందో కూడా అధికారులు గుర్తించినట్లు సమాచారం. అయితే ఈ ఘటనలో ఇప్పటివరకు ఎవరినైనా అదుపులోకి తీసుకున్నారా లేదా అనే విషయంపై అధికారిక సమాచారం వెలువడలేదు. ఈ బెదిరింపును చాలా తీవ్రంగా పరిగణిస్తున్నామని ఆస్ట్రేలియా అధికారులు తెలిపారు. భద్రతా సంస్థలు వివిధ కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నాయి. ప్రధాని మోడీ పర్యటన సందర్భంగా భద్రతను మరింత కట్టుదిట్టం చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు.

ఈ పర్యటనలో మోడీ పలు కీలక కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ముఖ్యంగా ఆస్ట్రేలియా-భారత్ వార్షిక సమావేశంలో కూడా ఆయన పాల్గొంటారు. ఈ సమావేశాల గురించి ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ ఆల్బనీస్ కీలక విషయాలు వెల్లడించారు. భారత్ తమ దేశానికి ముఖ్యమైన వ్యూహాత్మక, ఆర్థిక భాగస్వామి అన్నారు.

Anjibabu Ch
Anjibabu Chhttps://crimemirror.com/
గత 15 సంవత్సరాలుగా మీడియా రంగంలో ఉన్నారు. పలు ప్రముఖ మీడియా సంస్థల్లో పని చేశారు. ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నారు. రాజకీయాల నుంచి సినిమాల వరకు.. నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ వరకు.. స్పోర్ట్స్ నుంచి క్రైమ్ వరకు అన్ని రకాల కథనాలు అందిస్తున్నారు.

తాజావార్తలు