క్రైమ్ మిర్రర్,విజయవాడ:-విజయవాడలో లాకప్ డెత్ అయిన గాదె సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై తీవ్రస్థాయిలో ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తన కుమారుడిని ఉద్ధేశించిన పవన్ చేసిన వ్యాఖ్యలను ఆమె తీవ్రంగా ఖండించారు. తనను చంపాలనే కుట్ర జరుగుతోందన్నారు. తాము, కాపులంతా ఓట్లు వేసినందుకు పవన్ కల్యాణ్ బాగా బుద్ధి చెప్పారన్న ఆమె.. తన కొడుకు పవన్ కల్యాణ్ అభిమాని అని పేర్కొన్నారు. వాడిని క్రిమినల్ అంటావా.? అంటూ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కేసు వెనుక పెద్ద వాళ్లు ఉన్నారన్న ఆమె.. అందుకే వాడిని చంపేశారని ఆరోపించారు. తన కొడుకును తీసుకెళ్లిన వాళ్లను ఇంకా అరెస్టు చేయలేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తమను చంపేందుకు ప్రయత్నిస్తున్నారంటూ కన్నీటి పర్యంతమయ్యారు. ఇప్పటికే సాయికృష్ణ బూడిద ఇవ్వలేదని వాపోయారు. బూడిద అయినా ఇప్పించాలంటూ వేడుకున్నారు. తన కొడుకు బూడిద ఇవ్వకపోతే తాను నడిరోడ్డుపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించారు. తన కొడుకును హించిన వాళ్లు ఇంకా ఉన్నారని, లాకప్ డెత్ వెనుక ఉన్న పెద్దలను ఎందుకు అరెస్టు చేయాలేదని ఆమె ప్రశ్నించారు. ప్రస్తుతం కేసు విచారణ జరుగుతున్న తీరుపైనా ఆమె తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు.
సీబీఐ విచారణ చేయాలని డిమాండ్..
సాయికృష్ణ లాకప్ డెత్ కేసు విచారణ సవ్యంగా జరగడం లేదంటూ వైసీపీ నేతలు పేర్కొంటున్నారు. తాజాగా మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, అంబటి రాంబాబు మెజీస్టీరియల్ విచారణకు హాజరయ్యారు. ఈసందర్భంగా వారు కీలక విషయాలను వెల్లడించారు. అనంతరం తమకు అనేక అనుమానాలు ఉన్నాయని, అభ్యంతరాలన్నీంటిపైనా వినతిపత్రం ఇచ్చామని వెల్లడించారు. ఈ ఘటనపై సీబీఐ ఎంక్వైరీ చేయాలని డిమాండ్ చేస్తున్నట్టు మల్లాది పేర్కొన్నారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ ఈ కేసులో మాకున్న అనుమానాలు, అభిప్రాయాలను వినతిపత్రంలో తెలియజేశామన్న ఆయన.. లాకప్ డెత్ చేయడమే కాకుండా, బాడీ మాయం చేశారనని పేర్కొన్నారు. మే 28న సాయి కృష్ణ తల్లి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, జగన్ వచ్చిన తరువాత కంప్లైంట్ రిజిష్టర్ చేశారన్నారు. జగన్ రాకపోతే కేసు కూడా రిజిష్టర్ చేశారన్నారు. ఈ కేసులో సీఐ నాగరాజును ఇరికించి క్లోజ్ చేయానలి చూస్తున్నారన్న అంబటి.. దెబ్బలు తగిలినప్పుడు మాత్రమే మెజీస్టీరియల్ విచారణ చేయాలన్న ఆయన.. ఈ కేసును మాత్రం సీబీఐతో విచారణ చేయాలని డిమాండ్ చేశారు.
ప్రెగ్నెన్సీ టైంలో కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి ఆశ్చర్యపరిచిన సమంత !