Homeతెలంగాణమరో పర్యాటక అద్భుతానికి సిద్ధమవుతున్న హైదరాబాద్.. బుద్ధుడి చుట్టూ స్కైవాక్ ప్లాన్!

మరో పర్యాటక అద్భుతానికి సిద్ధమవుతున్న హైదరాబాద్.. బుద్ధుడి చుట్టూ స్కైవాక్ ప్లాన్!

క్రైమ్ మిర్రర్,తెలంగాణ:- హైదరాబాద్‌ను అంతర్జాతీయ స్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా తెలంగాణ ప్రభుత్వం మరో కీలక అడుగు వేయనుంది. ఇప్పటికే మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుతో నగర సౌందర్యాన్ని పెంచే పనులు చేపట్టిన ప్రభుత్వం, ఇప్పుడు హుస్సేన్ సాగర్‌ను మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా ప్రపంచ ప్రసిద్ధ ఏకశిలా బుద్ధ విగ్రహం చుట్టూ అత్యాధునిక సర్క్యులర్ స్కైవాక్ నిర్మించాలని యోచిస్తోంది.ప్రస్తుతం హుస్సేన్ సాగర్ మధ్యలో ఉన్న బుద్ధ విగ్రహాన్ని బోటింగ్ ద్వారా మాత్రమే దగ్గరగా వీక్షించే అవకాశం ఉంది. కొత్తగా ప్రతిపాదిస్తున్న స్కైవాక్ ద్వారా పర్యాటకులు విగ్రహాన్ని వివిధ కోణాల్లో ఆస్వాదించే అవకాశం కల్పించనున్నారు. ముఖ్యంగా సాయంత్రం వేళల్లో హుస్సేన్ సాగర్ అందాలు, రంగురంగుల వెలుగుల్లో మెరిసే బుద్ధ విగ్రహం, నగర దృశ్యాలు ఒకే చోట నుంచి వీక్షించేలా ఈ ప్రాజెక్ట్ రూపుదిద్దుకోనుంది. దీంతో హైదరాబాద్‌కు మరో ప్రత్యేక పర్యాటక ఆకర్షణ చేరనున్నట్లు అధికారులు భావిస్తున్నారు.

హుస్సేన్ సాగర్ అభివృద్ధితో పాటు రాష్ట్రంలో బౌద్ధ పర్యాటకాన్ని ప్రోత్సహించడంపైనా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. నల్గొండ జిల్లాలోని నాగార్జునసాగర్ బుద్ధవనాన్ని అంతర్జాతీయ బౌద్ధ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం 274 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ ప్రాంతంలో మరిన్ని ఆధునిక సౌకర్యాలు కల్పించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అలాగే ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో భారీ బుద్ధ స్తూపం నిర్మాణానికి కూడా ప్రభుత్వం సిద్ధమవుతోంది.ఇవే కాకుండా ఫణిగిరి, నేలకొండపల్లి, నాగార్జునసాగర్ బుద్ధవనం, హుస్సేన్ సాగర్ బుద్ధ విగ్రహం వంటి ప్రాంతాలను అనుసంధానిస్తూ ప్రత్యేక బౌద్ధ టూరిజం సర్క్యూట్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. వీకెండ్ టూరిజాన్ని ప్రోత్సహించేందుకు ప్రత్యేక టూర్ ప్యాకేజీలు కూడా అందుబాటులోకి తీసుకురావాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.ఈ ప్రాజెక్టులు అమల్లోకి వస్తే హైదరాబాద్ పర్యాటక రంగానికి కొత్త ఊపు రావడంతో పాటు దేశీయ, విదేశీ పర్యాటకులను మరింతగా ఆకర్షించే అవకాశం ఉంది. హుస్సేన్ సాగర్‌లో స్కైవాక్ ఏర్పాటు నగరానికి మరో ఐకానిక్ ల్యాండ్‌మార్క్‌గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ప్రెగ్నెన్సీ టైంలో కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి ఆశ్చర్యపరిచిన సమంత !

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు