అమరావతి, క్రైమ్ మిర్రర్: ఒంటరి మహిళపై అత్యాచారం కేసులో నిందితుడుగా ఉన్న సీఐ చిన్న మల్లయ్య తాజాగా మరో మహిళో ఉన్న వీడియో ఒకటి బయటకు వచ్చింది. కాగా ఇంట్లో ఒంటరిగా ఉన్న తనపై సీఐ చిన్న మల్లయ్య అత్యాచారం చేశాడంటూ వినుకొండ మండలం బ్రాహ్మణపల్లికి చెందిన ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ నేపథ్యంలో మరో మహిళతో ఉన్న వీడియో బయటకు వచ్చింది. చిన్న మల్లయ్య గతంలో వినుకొండలో సీఐగా పని చేశారు. బ్రహ్మణపల్లిలోని ఫామ్‌హౌస్‌లో ఎంతో మంది మహిళలతో ఆయన రాసలీలలు జరిపినట్లు తెలుస్తోంది.
పోలీస్ స్టేషన్‌కు వచ్చిన బాధిత మహిళలను లొంగదీసుకుని వారిని ఫామ్‌హౌస్‌కు తీసుకెళ్లే వాడన్న ప్రచారం జోరుగా సాగుతోంది. చిన్న మల్లయ్య ప్రస్తుతం పరారీలో ఉన్నారు. పోలీసులు ఆయన కోసం గాలిస్తున్నారు. వినుకొండ పట్టణ సీఐ ప్రభాకర్.. ఫోరెన్సిక్ నిపుణులతో నిన్న (గురువారం) సీఐ చిన్న మల్లయ్యతో పాటు బాధిత మహిళ ఇళ్ల వద్దకు వెళ్లారు. ఫోరెన్సిక్ నిపుణులు ఆధారాలు సేకరించారు. పోలీసులు బాధిత మహిళను చిలకలూరిపేటలోని న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచి, స్టేట్‌మెంట్ రికార్డు చేశారు.