Homeతెలంగాణఉగ్ర‌దాడుల‌తో భార‌తదేశ ఐక్య‌త‌ను విడ‌దీయ‌లేరు...! మృతుల‌కు ఘ‌న నివాళులు

ఉగ్ర‌దాడుల‌తో భార‌తదేశ ఐక్య‌త‌ను విడ‌దీయ‌లేరు…! మృతుల‌కు ఘ‌న నివాళులు

హైద‌రాబాద్‌, క్రైమ్ మిర్ర‌ర్:భార‌త దేశ ఐక్య‌త‌ను ప‌హ‌ల్గామ్ ఉగ్ర‌దాడుల తో దేశాన్ని విడ‌దీయ‌లేర‌ని తెలంగాణ ముఖ్య‌మంత్రి సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఉగ్ర‌వాదానికి దేశం ఒక్క‌తాటిపై నిలుస్తుంద‌న్నారు. గ‌త సంవ‌త్స‌రం జమ్మూకాశ్మీర్‌లోని అనంతనాగ్ జిల్లా పహల్గామ్ ఉగ్రదాడి ఘటనకు నేటితో ఏడాది పూర్తయింది. గతేడాది ఏప్రిల్ 22న పర్యాటకులపై దాడికి పాల్పడిన ముగ్గురు ఉగ్రవాదులు ఏకంగా 26 మందిని తుపాకులతో కాల్చి చంపారు

ఈ సందర్భంగా అమరులకు సీఎం రేవంత్ రెడ్డి ఘ‌న నివాళులు అర్పించారు. వీరుల త్యాగం దేశానికి శాశ్వత రుణంగా నిలుస్తోందని.. ఉగ్రకుట్రలు ఎప్పటికీ విఫలమవుతూనే ఉంటాయన్నారు. దేశ ప్రజలు అప్రమత్తంగా ఐక్యంగా ఉన్నారన్నారు సీఎం రేవంత్. బాధిత కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ విషాద సమయంలో దేశం మెుత్తం మీతోనే ఉందంటూ బాధిత కుటుంబాలకు ముఖ్యమంత్రి రేవంత్ భరోసా ఇచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు