Homeతెలంగాణచికెన్ ప్రియుల‌కు షాక్‌...ప‌ది రోజుల్లో రూ.100 పెరుగుద‌ల‌...!

చికెన్ ప్రియుల‌కు షాక్‌…ప‌ది రోజుల్లో రూ.100 పెరుగుద‌ల‌…!

హైదరాబాద్, క్రైమ్‌మిర్ర‌ర్‌: తెలుగు రాష్ట్రాల్లో నాన్‌వెజ్ ప్రియులకు చికెన్ ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. రోజురోజుకు పెరుగుతున్న ధరలతో చికెన్ ప్రియులు షాకవుతున్నారు. ముఖ్యంగా మేలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో చికెన్ ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. సాధారణంగా మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండే చికెన్ రేట్లు, కేవలం 10-15 రోజుల్లోనే కిలోపై రూ.100 వరకు పెరగడం సామాన్యుడికి పెద్ద భారంగా మారింది. ప్రస్తుతం మార్కెట్‌లో స్కిన్‌లెస్ చికెన్ ధర కిలో రూ. 350 నుండి రూ. 370 మార్కును దాటగా, కొన్ని ప్రాంతాల్లో రూ. 400 వరకు కూడా విక్రయిస్తున్నారు.ఫాం కేజీ కోడి ధర 115 రూపాయలు ఉంది.. డ్రెస్సెడ్ చికెన్ 220 – 240 వరకు.. స్కిన్ లెస్ రూ.250 వరకు ఉంది.. హైదరాబాద్ నగరంలో కేజీ చికెన్ ధర రూ.270 వరకు విక్రయిస్తున్నారు.

గుడ్లు డజన్ రూ. 72 వరకు ఉంది. అయితే.. ప్రాంతాల వారీగా చికెన్ ధరల్లో వ్యత్యాసం ఉంటుంది.. ఆదివారం కూడా దాదాపుగా ఇవే ధరలు కొనసాగుతాయని కోళ్ల ఫాం యజమానులు, చికెన్ వ్యాపారస్థులు చెబుతున్నారు.వేసవి ఎండల తీవ్రత: ఈ ఏడాది వేసవి ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరగడం పౌల్ట్రీ రంగాన్ని దెబ్బతీసింది. విపరీతమైన వేడి తట్టుకోలేక కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. దీనివల్ల ఫారాలలో కోళ్ల ఉత్పత్తి, బరువు గణనీయంగా తగ్గిపోయాయి. ఎండల దెబ్బకు నష్టాలు వస్తుండటంతో పౌల్ట్రీ రైతులు కూడా కొత్త బ్యాచ్‌ల పెంపకంపై పెద్దగా ఆసక్తి చూపడం లేదు.

ఉత్పత్తి తగ్గిపోవడంతో మార్కెట్‌కు కోళ్ల సరఫరా చాలా వరకు క్షీణించింది. అయితే, ఇదే సమయంలో పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాల సీజన్ నడుస్తుండటంతో చికెన్‌కు డిమాండ్ భారీగా పెరిగింది. సప్లై తక్కువగా ఉండి, డిమాండ్ ఎక్కువగా ఉండటంతో ధరలకు రెక్కలు వచ్చాయి.వీటికి తోడు నిర్వహణ ఖర్చులు పెరగడం వల్ల.. చికెన్ ధరలు పెరిగాయని వ్యాపారస్థులు చెబుతున్నారు.ఈ ధరల పెరుగుదల మరో 15 నుండి 20 రోజుల పాటు ఇలాగే కొనసాగే అవకాశం ఉందని, జూన్ మొదటి వారంలో వర్షాలు పడి వాతావరణం చల్లబడిన తర్వాతే రేట్లు తగ్గుముఖం పడతాయని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు