నల్గోండ,క్రైమ్‌మిర్రర్: అమెరికాలో జరగిన రోడ్డు ప్రమాదంలో నల్గోండ జిల్లాకు చెందిన యువతి మృతి చెందిన ఘటన ఆ ప్రాంతంలో విషాదం నెలకొంది. నల్గొండ జిల్లా నార్కెట్పల్లి మండలం చెరువుగట్టుకు చెందిన గడసు శ్రీనివాస్ రెడ్డి, శోభ దంపతుల పెద్ద కూతురు నవ్య(24), షికాగోలోని రూజ్ వెల్ట్ యూనివర్సిటీలో ఎంఎస్ చదువుతోంది. స్నేహితులతో కలిసి కారులో పార్ట్ టైమ్ ఉద్యోగానికి వెళ్తుండగా, వారి కారును వెనుక నుండి మరో కారు ఢీకొట్టింది. ప్రమాద సమయంలో వెనుక సీటులో కూర్చోవడంతో నవ్య తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందింది. దీంతో తల్లిదండ్రుల రోదనలు పలువురిని కంటతడిపెట్టించాయి.
అమెరికాలో రోడ్డు ప్రమాదం..నల్గొండ జిల్లా యువతి మృతి…!
0
128
Previous article