Homeఆంధ్ర ప్రదేశ్షర్మిల ఔట్..! పీసీసీ కి కొత్త సారథిగా ఆమంచి కృష్ణమోహన్...

షర్మిల ఔట్..! పీసీసీ కి కొత్త సారథిగా ఆమంచి కృష్ణమోహన్…

క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో: ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిలను మార్చుతారా? ఆమె స్థానంలో కొత్తవారికి బాధ్యతలు అప్పగిస్తారా? ఆమంచి కృష్ణమోహన్ కు అవకాశం ఇస్తారా? పొలిటికల్ వర్గాల్లో దీనిపైనే ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా షర్మిల నియామకం జరిగి మూడేళ్లు అవుతోంది. అందుకే ఇప్పుడు సంస్థాగతంగా ఆమె మార్పు అనివార్యం అని తెలుస్తోంది. దీనిపైనే రకరకాలుగా ప్రచారం సాగుతోంది.

గత ఎన్నికలకు ముందు…

2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా షర్మిల నియమితులయ్యారు. తెలంగాణలో తన తండ్రి పేరుతో పార్టీని ఏర్పాటు చేసిన షర్మిల అనుకున్న విధంగా అక్కడ రాణించలేకపోయారు. అందుకే కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి.. ఏపీ బాధ్యతలను తీసుకున్నారు. అయితే గత మూడు సంవత్సరాలుగా పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. కేవలం తన సోదరుడితో ఉన్న వ్యక్తిగత విభేదాలతో.. నిత్యం జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. కనీస స్థాయిలో కూడా ఆమె కాంగ్రెస్ బలం పెంచలేకపోయారన్నది ప్రధాన అపవాదు. ఆపై కాంగ్రెస్ సీనియర్లతో ఆమెకు విభేదాలు ఉన్నాయి. అందుకే ఆమెను మార్చాలన్న డిమాండ్ ఉంది కాంగ్రెస్ పార్టీలో.

చీరాలలో రెండో స్థానం…

తాజాగా మున్సిపల్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. కానీ ఉమ్మడి ప్రకాశం జిల్లా చీరాలలో మాత్రం రెండవ స్థానంలో నిలిచింది. అక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చైర్మన్గా గెలిచారు. 10 వార్డుల్లో కాంగ్రెస్ గెలిచి రెండో స్థానంలో నిలిచింది. దానికి కారణం ఆమంచి కృష్ణమోహన్. చీరాల నియోజకవర్గంలో బలమైన నేత. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను దించి అక్కడ గెలిపించుకున్నారు. అయితే ఒక్క చీరాల మాత్రమే కాదు. బలమైన నాయకత్వం ఇవ్వడం ద్వారా రాష్ట్రంలో కూడా పుంజుకోవచ్చు అని ఈ విజయం సూచించింది. అందుకే కాంగ్రెస్ హై కమాండ్ షర్మిలను మార్చాలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

తెరపైకి కృపారాణి పేరు…

అయితే ప్రముఖంగా పిసిసి అధ్యక్ష పదవికి శ్రీకాకుళం జిల్లాకు చెందిన కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి పేరు వినిపిస్తోంది. ఆమెతోపాటు జీవీ హర్ష కుమార్ వంటి వారి పేర్లు కూడా బయటకు వచ్చాయి. అయితే ఇప్పుడు ఆమంచి కృష్ణమోహన్ సైతం రేసులోకి వచ్చారు. ఆయనకు ఛాన్స్ ఇస్తే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పుంజుకునే అవకాశం ఉందన్న వాదనలు పెరుగుతున్నాయి. చీరాల మున్సిపాలిటీలో కాంగ్రెస్ రెండో స్థానంలో నిలవడం వైసీపీకి షాక్ గా మారింది. అందుకే ఆమంచి కృష్ణమోహన్ కు పిసిసి అధ్యక్ష పదవి ఇచ్చి.. షర్మిలను ఏఐసీసీలోకి తీసుకుంటారని టాక్ ప్రారంభం అయింది. అందులో ఎంతవరకు వాస్తవం ఉందో చూడాలి.

ఇవి కూడ చ‌ద‌వండి:
  1. నూతన సంవత్సరంలో 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సమరశం ఖం..!
  2.  ఏపీలో ఇక కాంగ్రెస్…!
  3. తెలంగాణ ఆర్థిక స్థితి మరియు సంక్షేమంపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
  4.  ప్రేమ పేరుతో వేధింపులు.. ప్రపోజల్ తిరస్కరించిందని డిగ్రీ విద్యార్థినిపై లైంగిక దాడి!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు