హైదరాబాద్, క్రైమ్ మిర్రర్ : సమంత హీరోయిన్గా రాబోతున్న..మా ఇంటి బంగారం సినిమా ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని కలిగిస్తోంది. యాక్షన్, కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్స్ కలగలిపిన ఈ చిత్రంలో సమంత రూత్ ప్రభు ప్రధాన పాత్రలో నటిస్తోంది. ఈ సినిమాను నందినీ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ పై సమంత, రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరు కలిసి నిర్మిస్తున్నారు.
ఈరోజు ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ “తస్సాదియ్యా” విడుదలైంది. ఈ పాట ఇప్పటికే మంచి రెస్పాన్స్ పొందుతోంది. పెళ్లిళ్లలో, వేడుకల్లో వినిపించేలా ఈ పాటను ఎంతో ఉత్సాహంగా రూపొందించారు. క్యాచీ ట్యూన్, ఎనర్జిటిక్ బీట్‌లతో ఈ పాట మ్యూజిక్ లవర్స్‌ను ఆకట్టుకుంటోంది. అయితే ఇప్పటిదాకా అక్కినేని ఫ్యామిలీ వారే ఎక్కువగా తస్సాదియ్యా అన్న పదం వాడిన సంగతి తెలిసిందే. ఇప్పుడు సమంత ఆ మాట పైనే పాట చేసేయడంతో ఈ పాట కాస్త తెగ వైరల్ అవుతుంది.
ఈ పాటకు రెహమాన్ సాహిత్యం అందించగా, చిన్మయి శ్రీపాద మరియు పుణ్య సెల్వ తమ స్వరాలతో మరింత అందంగా తీర్చిదిద్దారు. సంగీతాన్ని సంతోష్ నారాయణన్ అందించారు. ఆయన అందించిన ట్యూన్ చాలా ఆకట్టుకునేలా ఉంది. పాటలో సమంత చాలా గ్రేస్‌ఫుల్‌గా, ఎనర్జీతో కనిపించింది. ఆమె డ్యాన్స్ స్టెప్స్, స్టైలిష్ కొరియోగ్రఫీ పాటను మరింత ఆకర్షణీయంగా మార్చాయి.
ఇప్పటికే విడుదలైన టీజర్ ఈ సినిమాకు మంచి బజ్ తీసుకొచ్చింది. అలాగే సమంత..నందినీ రెడ్డి కాంబినేషన్ మరోసారి రావడం కూడా ఈ సినిమాపై అంచనాలను పెంచింది. వీరిద్దరూ ముందుగా చేసిన ఓ బేబీ సినిమా మంచి విజయాన్ని సాధించింది. అందుకే ఇప్పుడు ఈ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లేను రాజ్ నిడిమోరు, వసంత్ మారింగంటి, సీతా మీనన్ కలిసి అందించారు. ఇందులో దిగ్నాథ్, గుల్షన్ దేవయ్య, శ్రీముఖి, గౌతమి, ఆనంద్, లక్ష్మీ, శ్రీనివాస్ గవిరెడ్డి, మంజూష తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.
మా ఇంటి బంగారం సినిమా చిన్నా, పెద్దా అన్న తేడా లేకుండా కుటుంబం మొత్తం కలిసి చూడదగ్గ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. ఈ చిత్రం సమ్మర్ స్పెషల్‌గా మే 15న గ్రాండ్‌గా విడుదల కానుంది.
