క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్:- ఐపీఎల్ లో భాగంగా ముంబై ఇండియన్స్ కు కీలకమైన బౌలర్ గా ఉన్నటువంటి స్టార్ బౌలర్ బుమ్రా ఈ ఏడాది ఐపీఎల్ లో దారుణమైన ప్రతిభను కనబరుస్తున్నారు. ఈ ఏడాది ఇప్పటివరకు ఆడిన ఐదు మ్యాచ్లలో ముంబై కేవలం ఒక మ్యాచ్ మాత్రమే గెలిచింది. మిగతా నాలుగు మ్యాచ్లలో ఘోరంగా విఫలమయ్యింది. అయితే ముంబై ఇండియన్స్ వరుసగా నాలుగు మ్యాచ్లు ఓడిపోవడానికి గల ముఖ్య కారణం బౌలర్లు. మినీ వేలం తర్వాత ముంబై ఇండియన్స్ దగ్గర ఉన్నటువంటి బౌలింగ్ బలం ఇతర జట్లలో లేదు అని ప్రతి ఒక్కరూ ప్రస్తావించారు. కానీ నేడు ఆ బౌలర్లే ఓటమికి కారణమవుతున్నారు. బుమ్రా, బోల్ట్, దీపక్ చాహార్, శార్దూల్ ఠాగూర్, మిచెల్ శాంట్నర్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది స్టార్ బౌలర్లు ఉన్నారు. ప్రతి ఏడాది మిగతా బౌలర్ల విషయం పక్కన పెడితే ముంబై ఇండియన్స్ జట్టులో బుమ్రా మాత్రం వేరే లెవెల్ ప్రతిభ కనబరుస్తుంటారు. కానీ ఈ ఏడాది ఆడిన ఐదు మ్యాచ్లలో కేవలం ఒక వికెట్ కూడా తీయకపోవడం అనేది అతని దారుణమైన ప్రదర్శన అర్థమవుతుంది. ఈసారి భారీగా పరుగులు కూడా ఇచ్చేస్తుండడంతో బుమ్రా పై ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిన్న పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో కూడా నాలుగు ఓవర్లు వేసి 41 పరుగులు సమర్పించుకున్నారు. దీంతో బుమ్రా తిరిగి మళ్ళీ ఫామ్ లోకి రావాలి అని ఫాన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
Samantha: తస్సాదియ్యా అంటున్న సమంత… అక్కినేని ఫ్యామిలీ బాటలో…!
Extreme Heatwave: 45 డిగ్రీల వేడి.. మే, జూన్‌లో పరిస్థితి ఇంకా కష్టమే .. వాతావరణ హెచ్చరిక!
